Wednesday, January 26, 2022

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది 

వరుస పరాజయాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుంది. భవిషత్తులో ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకం ఆయనలో సన్నగిల్లుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన అనేకమంది నేతలకు తమ పార్టీకి భవిష్యత్తు లేదనే నమ్మకం వచ్చేసింది. అందుకే సాక్షాత్తూ పార్టీ ఆంధ్ర ప్రదేశ్అధ్యక్షుడి హోదాలో ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు “పార్టీ లేదు .. బొ  … లేదు”  అనేశారు. బయటకు అనకపోయినా అనేకమంది టీడీపీ నేతల్లో నెమ్మది నెమ్మదిగా ఈ నమ్మకం బలపడుతోంది. 2024లో పార్టీ గెలుస్తుంది, తిరిగి అధికార పగ్గాలు చేపడుతుంది అనే విశ్వాసం మెల్లగా సన్నగిల్లుతోంది. అందుకే చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పరిధిని దాటి వ్యాఖ్యలు చేస్తున్నారు.

2019లో ఘోర పరాజయం తర్వాత పార్టీ నేతలూ, కార్యకర్తలూ, సానుభూతిపరులూ, మద్దతుదారులూ మానసికంగా కూడా పెద్ద దెబ్బే తిన్నారు. పార్టీ ఓటమి ఓవైపు వారిని రాజకీయంగా కుంగదీస్తే, అమరావతి రాజధాని కాదు అనే నిర్ణయం పార్టీ మద్దతుదారులను దెబ్బతీసింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాలు పార్టీ మద్దతుదారుల ఆర్ధిక మూలాలను కోలుకోలేని దెబ్బ తీశాయి. అందుకే టీడీపీ ఎంత గింజుకున్నా, ఆపార్టీ అనుకూల మీడియా ఎంతగా ప్రచారం చేసినా అమరావతి ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది.
ఇక 2019 ఓటమి తర్వాత రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించలేకపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో కమ్యూనిస్టు పార్టీల తర్వాత అంత బలమైన, విశ్వాసపాత్రులైన కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీ మాత్రమే. అటువంటి విశ్వాసపాతరులైన కార్యకర్తలు ఇప్పుడు బలహీనపడినట్టు కనిపిస్తోంది. ఏవో అల్లరి మూకలు తప్ప చంద్రబాబు నాయుడు, లోకేష్ మరో ఇద్దరు ముగ్గురు నేతల  రెచ్చగొట్టే  ఉపన్యాసాలు టీడీపీ కార్యకర్తలను ప్రేరేపించలేకపోతున్నాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒకరిద్దరు నాయకులు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు నేతలు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. అందువల్లే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమిని చూడాల్సి వచ్చింది.


ఇప్పుడు చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటమి ఖాయమనే నిర్ణయానికి టీడీపీ నేతలు వచ్చేశారు. పార్టీ గెలుస్తుందన్న విశ్వాసం వారిలో కనపడడం లేదు. పార్టీ భవిష్యత్తుతో పాటు లోకేష్ భవిష్యత్తు కూడా వారికి దరిదాపుల్లో కనిపించడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రకటనతో లేదా ప్రభుత్వంపై ఏదో ఒక కేసుతో కార్యకర్తల్లో విశ్వాసం కలిగించాలని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తూ చంద్రబాబు చేస్తున్న కృషి ఫలిస్తున్నట్టు కనిపించడం లేదు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఇలా వ్యవస్థలను ప్రభావితం చేసి బలనిరూపణ చేసే చర్యలను సమర్ధించడం లేదు. ఇలాంటి చర్యలకు వారి ఆమోదం కూడా లభించడం లేదు.
చంద్రబాబుతో కలిసి నడిచేందుకు పార్టీ నాయకులే కాదు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరనేది సుస్పష్టం. ఇందుకు కారణాలు లేకపోలేదు. చిత్తశుద్ధితో ఆలోచిస్తే ఆ కారణాలు చంద్రబాబుకు కూడా కనిపిస్తాయి. అయితే చంద్రబాబుకు అలా చిత్తశుద్ధితో ఆలోచించే అలవాటు లేదు. అందుకే ఈ వరుస ఓటములు ఆయనకు అర్ధం కావడం లేదు. కార్యకర్తల్లో, నాయకుల్లో కనిపించే ఈ మౌనం స్తబ్దత కాదు. ఇది వారిలో వస్తున్న మార్పు.


2019 ఎన్నికల్లో పరాజయం కంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే టీడీపీ కార్యకర్తల్లో క్రిందిస్థాయి నేతల్లో మార్పు వచ్చింది. “పార్టీ చూడం. ప్రాంతం చూడం. కులం చూడం. మతం చూడం” అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానం వాస్తవమై కనిపిస్తోంది. తాము టీడీపీ నేతలం అయినా, కార్యకర్తలం అయినా తమకు తమ పిల్లలకు సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చాయి. తాము టీడీపీ అయినా తమ పెన్షన్ దరఖాస్తు ఆమోదం పొంది పెన్షన్ వస్తోంది. తాము టీడీపీ అయినా తమకు ఇళ్ళ స్థలం వచ్చింది. తాము టీడీపీ అయినా తమకు అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి పధకాల ద్వారా నగదు వస్తోంది. ఇది క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది.
చంద్రబాబుకు చేయూత పధకం రాకపోవచ్చు. లోకేష్ కు ఆసరా పధకం అమలు కాకపోవచ్చు. దేవాన్ష్ కు అమ్మఒడి పధకం అమలు కాకపోవచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో అర్హులైన అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఈ పధకాలు అమలవుతున్నాయి. ఈ పధకాల ద్వారా నగదు వస్తోంది. వీటికి మించి నాడు-నేడులో భాగంగా ఊర్లో బాగుపడిన బడి కనిపిస్తోంది. మెరుగుపడిన ఆస్పత్రి కనిపిస్తోంది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకున్న తీరు కనిపిస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన టీడీపీ నేతలకు అందిన వైద్యం, తద్వారా వారు కోలుకున్న విధానం జగన్మోహన్ రెడ్డి పాలనకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అందుకే చంద్రబాబు ఎంత తిట్టినా, ఎన్ని వ్యవస్థలతో ప్రభుత్వంపై దాడి చేయించినా, సుశిక్షితులైన టీడీపీ కార్యకర్తలు ఇక మౌనంగానే ఉండబోతున్నారు. ఆ ఫలితమే ఇప్పటివరకూ టీడీపీకి వరుస ఓటములు. ఇక కుప్పంలో కూడా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

సై అంటున్న మాస్ మహారాజా…

క్రాక్‌ హిట్‌ తర్వాత రవితేజ నటించిన సినిమా ఖిలాడి. రమేష్‌ వర్మ దర్శకుడు. డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌ కాగా... ఇప్పటికే టీజర్.. మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమాగా...

మల్టీ స్టారర్లు కావు ఫ్యామ్లీ స్టారర్లు

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. డబుల్ స్టార్డమ్‌తో ఓపెనింగ్స్‌ కూడా పెరుగుతాయి. కానీ ఇమేజ్‌ లెక్కలతో మల్టీస్టారర్స్‌కి వెనకాడుతున్నారు టాలీవుడ్ స్టార్లు. దీంతో ఫ్యామిలీ స్టారర్స్‌ వైపు వెళ్తున్నారు...

వైష్ణవ్ గట్టు ఎక్కుతాడా?

వైష్ణవ్‌ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పల్లె ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌ కొంచెం బరువైన పాత్రనే పోషించాడు. అయితే ఈ ఆశి క్యారెక్టర్‌లో...

వారసులు వస్తున్నారు కాచుకోండి

ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. సౌత్‌ నుంచి మొదలుపెడితే నార్త్‌ వరకు బోల్డంతమంది వారసత్వపు హీరోలు కనిపిస్తారు. అయితే తెలుగులో ఈ ఇయర్‌లోనే అరడజను వరకు వారసులు హీరోలుగా మారారు. ఇప్పటికే...

పవర్ స్టార్ దీ మెగాస్టార్ రూటే …

వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు. 2023 మార్చి లోపు కనీసం రెండు...

ఓటీటీ నీ ఒణికిస్తున్న అఖండ

అఖండ రిలీజై 50 రోజులు దాటినా మాస్ జాతరకు కామానే గానీ... ఫుల్‌స్టాఫ్‌ పడలేదు. కంటిన్యూ అవుతూనే వుంది. నిన్నటివరకు థియేటర్స్‌లో.. ప్రస్తుతం ఓటీటీలో అఖండ సృష్టిస్తున్న హవా అంతా ఇంతాకాదు.. ఓటీటీలో...

ప్రభుత్వ వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించిన ఉద్యోగులు 

నిత్యం జీతాలకోసమో, అదనపు సదుపాయాలకోసమో లేక పని భారం పెరిగిందనో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు చేస్తుంటారు. ఎక్కడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజలకు సదుపాయాలు లేవనో, మరే ఇతర ప్రజా సమస్యపైనో పోరాటం చెయ్యరు. ప్రపంచం తల్లకిందులైనా, ప్రక్రుతి ఆగ్రహించినా,...

హిట్టు పడితే చాలు

ఒక్క హిట్‌ పడితే రెమ్యునరేషన్‌ అమాంతం పెరిగిపోతుంది. స్టార్‌డమ్‌ వస్తే ఆలెక్కే వేరు. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో సక్సెస్‌ లేకపోయినా రెమ్యునరేషన్‌కు రెక్కలొస్తాయి. వరుసగా ఐదు హిట్స్‌తో పూజా హెగ్డేకు వచ్చిన...

ప్రభాస్ జోరు

ప్రభాస్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే. 2023 వరకు ఖాళీ లేనంత బిజీగా చేతిలో సినిమాలున్నాయి. సలార్‌... ఆదిపురుష్‌... నాగఅశ్విన్‌... సందీప్‌ వంగా సినిమాలు లైన్లో వున్నాయి. ఇవన్నీ పూర్తికావడానికి రెండేళ్లు...

అన్నీ వాయిదాలే!

కరోనా జీవితాలనే కాదు.. సినిమాలను చిందరవందర చేసేసింది. ముందుగా అనుకున్న డేట్‌కు ఒక్క సినిమా రావడం లేదు. పోస్ట్‌పోన్‌ చేసి మళ్లీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంటే.. మరో సినిమాతో క్లాష్‌ తప్పడం...