Wednesday, January 26, 2022

చంద్రబాబు ఏదో చిట్టా రాస్తున్నారంట! 

అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చుని అవమానకర రాజకీయ జీవితం గడుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో చిట్టా రాస్తున్నారంట. మొత్తానికి ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి దెబ్బకు రెండు నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు మరో రెండేళ్ళలో అధికారంలోకి వచ్చేస్తా అంటూ డాంబికాలు పలుకుతున్నారు. గత మూడేళ్ళుగా రాష్ట్రంలో పరిపాలన పడకేసిందని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి పధంలో దూసుకు వెళ్ళిందని అవే కబుర్లు చెప్పారు. కుప్పంలో మూడురోజల పాటు పర్యటించిన చంద్రబాబు నాయుడు తనకు ఈ గతి పట్టించిన జగన్మోహన్ రెడ్డిని 2024లో ఓడిస్తా అంటూ ఉత్తర కుమార గొప్పలు చెప్పుకున్నారు.


పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్లు ఇంకా కొనసాగుతున్నాయని, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో అన్న క్యాంటిన్లు మూసేశారని చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే తమిళ నాడులో అమ్మ క్యాంటీన్లు ఎన్నేళ్ళుగా నిర్వహిస్తున్నారు? ఎన్ని అమ్మ క్యాంటీన్లు నిర్వహిస్తున్నారో చంద్రబాబు చెప్పగలరా? అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో అన్న క్యాంటీన్లు ఎన్ని నిర్వహించారు? ఎంత కాలం నిర్వహించారు? 2019 ఎన్నికలకు ముందు దఫదఫాలుగా 500 క్యాంటీన్లు నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఎన్నో యేళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అన్న క్యాంటీన్లు నిర్వహించి రాష్ట్రంలో అనేక వేలమంది పేదప్రజలకు అన్నదానం చేసినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. తాను ఎలాంటి అబద్దం చెప్పినా, తన కుల మీడియా ఎన్ని అబద్దాలు రాసినా జనం నమ్ముతారని చంద్రబాబు నాయుడు ఇంకా నమ్ముతున్నట్టు ఉన్నారు.


ఇప్పుడు నడుస్తున్నవి 2020 దశకం. అరచేతిలో సోషల్ మీడియా అన్ని విషయాలు చెప్తుంది. చరిత్ర కూడా అరచేతిలో చెపుతుంది. గతంలో చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పారో, ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడారో చెప్పే అవకాశం వచ్చింది. ఆరచేతిలోని ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు ఎన్ని అన్న క్యాంటీన్లు పెట్టారో, ఎక్కడెక్కడ క్యాంటీన్లు తెరిచారో? ఎంతకాలం అన్న క్యాంటీన్లు నడిపారో తెలుస్తుంది. కానీ ఇవన్నీ మర్చిపోయి తాను ఈ రాష్ట్రం మొత్తం అన్ని ఊళ్ళలో కొన్ని వేల అన్న క్యాంటీన్లు, పదుల సంవత్సరాలపాటు నిర్వహించినట్టు అబద్దాలు మాట్లాడి ప్రజల దృష్టిలో అభాసుపాలవుతున్నారు. అందరికీ మించిన అబద్ధాలకు ఆద్యుడు అయిన చంద్రబాబు నాయుడు ఇతరులపై ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారని మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు.


వయసు 70 యేళ్ళు దాటింది. రాజకీయ అనుభవం 40 యేళ్ళు దాటింది. ముఖ్యమంత్రిగా అనుభవం ఓ 15 యేళ్ళు దాటింది. ఇంత అనుభవం ఉండి కూడా నిత్యం అబద్దాలు ప్రచారం చేయడం ఒక్క చంద్రబాబు నాయుడుకే చెల్లింది. ఈ దేశంలో నిరభ్యంతరంగా, నిస్సంకోసంగా అబద్దాలు తడబాటు లేకుండా చెప్పగలిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడుకు ఓ జాతీయ స్థాయి లేదా అంతర్జాతీయ స్థాయి అవార్డు ఇవ్వొచ్చు. అప్పుడెప్పుడో ఓ విదేశీ మంత్రి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి, చంద్రబాబు నాయుడు లా అబద్దాలు మాట్లాడితే మా దేశంలో అయితే జైల్లో వేస్తారు అంటూ ప్రకటించిన విషయం నిజమే అనిపిస్తుంది. అటువంటి చంద్రబాబు నాయుడు యధాప్రకారం కుప్పంలో మరోసారి అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.
ఇలాంటి ప్రచారాలను జనం నమ్మే పరిస్థితి లేదని గ్రహించలేక పోవడం చంద్రబాబు నాయుడు పతనానికి కారణం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ, ఆయనకు మద్దతు ఇస్తున్న కుల మీడియా కానీ ఇప్పటికైనా మేల్కోక పోతే ఇంతకు మించిన పతనం తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

సై అంటున్న మాస్ మహారాజా…

క్రాక్‌ హిట్‌ తర్వాత రవితేజ నటించిన సినిమా ఖిలాడి. రమేష్‌ వర్మ దర్శకుడు. డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌ కాగా... ఇప్పటికే టీజర్.. మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమాగా...

మల్టీ స్టారర్లు కావు ఫ్యామ్లీ స్టారర్లు

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. డబుల్ స్టార్డమ్‌తో ఓపెనింగ్స్‌ కూడా పెరుగుతాయి. కానీ ఇమేజ్‌ లెక్కలతో మల్టీస్టారర్స్‌కి వెనకాడుతున్నారు టాలీవుడ్ స్టార్లు. దీంతో ఫ్యామిలీ స్టారర్స్‌ వైపు వెళ్తున్నారు...

వైష్ణవ్ గట్టు ఎక్కుతాడా?

వైష్ణవ్‌ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పల్లె ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌ కొంచెం బరువైన పాత్రనే పోషించాడు. అయితే ఈ ఆశి క్యారెక్టర్‌లో...

వారసులు వస్తున్నారు కాచుకోండి

ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. సౌత్‌ నుంచి మొదలుపెడితే నార్త్‌ వరకు బోల్డంతమంది వారసత్వపు హీరోలు కనిపిస్తారు. అయితే తెలుగులో ఈ ఇయర్‌లోనే అరడజను వరకు వారసులు హీరోలుగా మారారు. ఇప్పటికే...

పవర్ స్టార్ దీ మెగాస్టార్ రూటే …

వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు. 2023 మార్చి లోపు కనీసం రెండు...

ఓటీటీ నీ ఒణికిస్తున్న అఖండ

అఖండ రిలీజై 50 రోజులు దాటినా మాస్ జాతరకు కామానే గానీ... ఫుల్‌స్టాఫ్‌ పడలేదు. కంటిన్యూ అవుతూనే వుంది. నిన్నటివరకు థియేటర్స్‌లో.. ప్రస్తుతం ఓటీటీలో అఖండ సృష్టిస్తున్న హవా అంతా ఇంతాకాదు.. ఓటీటీలో...

ప్రభుత్వ వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించిన ఉద్యోగులు 

నిత్యం జీతాలకోసమో, అదనపు సదుపాయాలకోసమో లేక పని భారం పెరిగిందనో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు చేస్తుంటారు. ఎక్కడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజలకు సదుపాయాలు లేవనో, మరే ఇతర ప్రజా సమస్యపైనో పోరాటం చెయ్యరు. ప్రపంచం తల్లకిందులైనా, ప్రక్రుతి ఆగ్రహించినా,...

హిట్టు పడితే చాలు

ఒక్క హిట్‌ పడితే రెమ్యునరేషన్‌ అమాంతం పెరిగిపోతుంది. స్టార్‌డమ్‌ వస్తే ఆలెక్కే వేరు. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో సక్సెస్‌ లేకపోయినా రెమ్యునరేషన్‌కు రెక్కలొస్తాయి. వరుసగా ఐదు హిట్స్‌తో పూజా హెగ్డేకు వచ్చిన...

ప్రభాస్ జోరు

ప్రభాస్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే. 2023 వరకు ఖాళీ లేనంత బిజీగా చేతిలో సినిమాలున్నాయి. సలార్‌... ఆదిపురుష్‌... నాగఅశ్విన్‌... సందీప్‌ వంగా సినిమాలు లైన్లో వున్నాయి. ఇవన్నీ పూర్తికావడానికి రెండేళ్లు...

అన్నీ వాయిదాలే!

కరోనా జీవితాలనే కాదు.. సినిమాలను చిందరవందర చేసేసింది. ముందుగా అనుకున్న డేట్‌కు ఒక్క సినిమా రావడం లేదు. పోస్ట్‌పోన్‌ చేసి మళ్లీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంటే.. మరో సినిమాతో క్లాష్‌ తప్పడం...