Wednesday, January 26, 2022

జనవరి 17 ఏ హిందూ పండగ ఉంది రఘురామ..?

రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు కు ఆంద్రప్రదేశ్ సిఐడి అధికారులు నోటీసు ఇచ్చారు. ఈనెల 17న మంగళగిరిలోని తమ కార్యాలయానికి హాజరు కావాలని సిఐడి అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. రఘురామ కృష్ణంరాజు ఇంతకు ముందే ఈ కేసులో అరెస్టు అయ్యారు. కొన్ని రోజులపాటు జైల్లో కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిలు ఇవ్వడంతో ఆయన బయటపడ్డారు. క్రైస్తవులను, రెడ్డి కులస్తులను దూషించిన నేరంలో రఘురామ కృష్ణంరాజు పై సిఐడి అధికారులు 2021 మే నెలలో అరెస్టు అయ్యారు. తనకు మొదటిసారి టిక్కెట్టు ఇచ్చి మొదటిసారి పార్లమెంటు సభ్యుణ్ణి చేసిన జగన్మోహన్ రెడ్డిని నిత్యం బూతులు తిడుతూ, విషం కక్కుతూ కాలం గడుపుతున్న రఘురామ కృష్ణంరాజు తనకు ఇచ్చిన నోటీసుపై స్పందించారు. తాను హిందువుల కీలకమైన సంక్రాంతి పండగకోసం సొంత గ్రామానికి  వెళుతుంటే నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని, అలాగే సిఐడి అధికారి సునీల్ కుమార్ కూడా క్రిస్టియన్ అని అందువల్ల వాళ్లకు హిందువుల మనోభావాలు తెలియవని మత అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ జనవరి 16తో ముగుస్తుంది. పండగ ముగిసిన తర్వాత విచారణకు రావలసిందిగా అధికారులు నోటీసు ఇస్తే దాన్ని పండగతో ముడిపెట్టి మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, తద్వారా ముఖ్యమంత్రిని, అధికారులను మతం పేరుతో ప్రజలకు దూరం చేయాలని చూడడం రఘురామ కృష్ణంరాజు మొదటినుండీ అనుసరిస్తున్న రాజాకీయం. అయితే రఘురామ కృష్ణంరాజు ఎన్ని అబద్ధాలు ప్రచారంలోకి తెచ్చినా ప్రజలు నమ్మరు.

ఇన్ని కబుర్లు చెప్తున్న రఘురామ కృష్ణంరాజు అసలు విచారణకు హాజరు అవుతారా? లేక కోర్టుకు వెళ్ళి మినహాయింపు తెచుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. ఆయన మాటలు జాగ్రత్తగా గమనిస్తే సిఐడి విచారణ సమయంలో ఆ కార్యాలయంలో సిసి కెమెరాలు ఉండాలని డిమాండు చేస్తున్నారు. అలాగే విచారణ సమయంలో తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భద్రత సిబ్బంది ఉండాలని కోరే అవకాశముంది. వీటితో పాటు అసలు విచారణకు సీఐడీ డీజీ సునీల్ కుమార్ ఉండకూడదు అని మరో కొత్త డిమాండు తెరపైకి తెచ్చారు. ఈ అంశాలపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇన్ని డాంబికాలు పలికి చివరికి ఏదో ఒక సాకుతో విచారణ తప్పించుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.ఇన్ని సాకులు వెతుక్కుంటూనే మరో వైపు మతం అంశం తెచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇన్ని దొంగదారులు వెతుక్కునే వాళ్ళు మీడియా ముందు కూర్చుని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికితే జనం హర్షిస్తారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇవి సోషల్ మీడియా రోజులు అని ఇంకా స్పృహలోకి రాకపోతే ఎలా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

సై అంటున్న మాస్ మహారాజా…

క్రాక్‌ హిట్‌ తర్వాత రవితేజ నటించిన సినిమా ఖిలాడి. రమేష్‌ వర్మ దర్శకుడు. డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌ కాగా... ఇప్పటికే టీజర్.. మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమాగా...

మల్టీ స్టారర్లు కావు ఫ్యామ్లీ స్టారర్లు

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. డబుల్ స్టార్డమ్‌తో ఓపెనింగ్స్‌ కూడా పెరుగుతాయి. కానీ ఇమేజ్‌ లెక్కలతో మల్టీస్టారర్స్‌కి వెనకాడుతున్నారు టాలీవుడ్ స్టార్లు. దీంతో ఫ్యామిలీ స్టారర్స్‌ వైపు వెళ్తున్నారు...

వైష్ణవ్ గట్టు ఎక్కుతాడా?

వైష్ణవ్‌ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పల్లె ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌ కొంచెం బరువైన పాత్రనే పోషించాడు. అయితే ఈ ఆశి క్యారెక్టర్‌లో...

వారసులు వస్తున్నారు కాచుకోండి

ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. సౌత్‌ నుంచి మొదలుపెడితే నార్త్‌ వరకు బోల్డంతమంది వారసత్వపు హీరోలు కనిపిస్తారు. అయితే తెలుగులో ఈ ఇయర్‌లోనే అరడజను వరకు వారసులు హీరోలుగా మారారు. ఇప్పటికే...

పవర్ స్టార్ దీ మెగాస్టార్ రూటే …

వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు. 2023 మార్చి లోపు కనీసం రెండు...

ఓటీటీ నీ ఒణికిస్తున్న అఖండ

అఖండ రిలీజై 50 రోజులు దాటినా మాస్ జాతరకు కామానే గానీ... ఫుల్‌స్టాఫ్‌ పడలేదు. కంటిన్యూ అవుతూనే వుంది. నిన్నటివరకు థియేటర్స్‌లో.. ప్రస్తుతం ఓటీటీలో అఖండ సృష్టిస్తున్న హవా అంతా ఇంతాకాదు.. ఓటీటీలో...

ప్రభుత్వ వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించిన ఉద్యోగులు 

నిత్యం జీతాలకోసమో, అదనపు సదుపాయాలకోసమో లేక పని భారం పెరిగిందనో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు చేస్తుంటారు. ఎక్కడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజలకు సదుపాయాలు లేవనో, మరే ఇతర ప్రజా సమస్యపైనో పోరాటం చెయ్యరు. ప్రపంచం తల్లకిందులైనా, ప్రక్రుతి ఆగ్రహించినా,...

హిట్టు పడితే చాలు

ఒక్క హిట్‌ పడితే రెమ్యునరేషన్‌ అమాంతం పెరిగిపోతుంది. స్టార్‌డమ్‌ వస్తే ఆలెక్కే వేరు. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో సక్సెస్‌ లేకపోయినా రెమ్యునరేషన్‌కు రెక్కలొస్తాయి. వరుసగా ఐదు హిట్స్‌తో పూజా హెగ్డేకు వచ్చిన...

ప్రభాస్ జోరు

ప్రభాస్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే. 2023 వరకు ఖాళీ లేనంత బిజీగా చేతిలో సినిమాలున్నాయి. సలార్‌... ఆదిపురుష్‌... నాగఅశ్విన్‌... సందీప్‌ వంగా సినిమాలు లైన్లో వున్నాయి. ఇవన్నీ పూర్తికావడానికి రెండేళ్లు...

అన్నీ వాయిదాలే!

కరోనా జీవితాలనే కాదు.. సినిమాలను చిందరవందర చేసేసింది. ముందుగా అనుకున్న డేట్‌కు ఒక్క సినిమా రావడం లేదు. పోస్ట్‌పోన్‌ చేసి మళ్లీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంటే.. మరో సినిమాతో క్లాష్‌ తప్పడం...