Wednesday, January 26, 2022

దక్ష క్రేజీ పబ్లిసిటీ…

దక్షా నాగర్కర్‌.. నిన్నటి వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. రెగ్యులర్‌ మూవీ గోయర్స్‌ కూడా దక్షాని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకే ఒక్క ఇన్సిడెంట్‌తో దక్షా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. నాగచైతన్య వీడియోతో క్రేజీ పబ్లిసిటీ తెచ్చుకుంది. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌లా సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.నాగార్జున, నాగచైతన్య హీరోలుగా వస్తోన్న సినిమా ‘బంగార్రాజు’. ‘మనం’ తర్వాత మళ్లీ తండ్రీకొడుకులు కలిసి నటించిన ఈ సినిమా సంక్రాంతి పండగని క్యాష్‌ చేసుకుంటుందని ఆశ పడుతోంది అక్కినేని కాంపౌండ్‌. అయితే జనాలు మాత్రం సినిమా కంటే దక్షా నాగర్కర్‌ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ‘బంగార్రాజు’ మ్యూజికల్‌ నైట్‌లో చైతన్య, దక్షా మధ్య జరిగిన మూమెంట్స్‌ వైరల్ అవుతున్నాయి.దక్షా నాగర్కర్ ఇంతకుముందు ‘హోరా హోరీ, హుషారు, జాంబీరెడ్డి’ లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఒక్క సినిమాతో కూడా దక్షాకి పెద్దగా పేరు రాలేదు. దీంతో హీరోయిన్ నుంచి సపోర్టింగ్‌ రోల్స్‌కి షిఫ్ట్ అయ్యింది. ‘బంగార్రాజు’ సినిమాలో ఒక రోల్ ప్లే చేసింది దక్షా.

ఇక ‘బంగార్రాజు’ మ్యూజికల్‌ నైట్‌లో నాగచైతన్య, దక్షా నాగర్కర్ మధ్య కళ్లతోనే చిన్న చాట్‌ నడిచింది. వీళ్లిద్దరు కళ్లతో మాట్లాడుకున్న ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కి ఒకే ఒక్క టీజర్‌తో నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ వచ్చింది. ‘ఒరు ఆదార్‌ లవ్’తో వింక్‌ సెన్సేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. ఫేడవుట్‌ స్టేజ్‌లో ఉంది. దక్షా నాగర్కర్‌ కూడా సేమ్‌ టు సేమ్‌ చిన్న వీడియోతో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి మూడునాలుగు సినిమాలు చేసినా స్టార్డమ్‌ తెచ్చుకోలేకపోయిన దక్షా కెరీర్‌కి చైతు వీడియో ఎంతవరకు హెల్ప్‌ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

సై అంటున్న మాస్ మహారాజా…

క్రాక్‌ హిట్‌ తర్వాత రవితేజ నటించిన సినిమా ఖిలాడి. రమేష్‌ వర్మ దర్శకుడు. డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌ కాగా... ఇప్పటికే టీజర్.. మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమాగా...

మల్టీ స్టారర్లు కావు ఫ్యామ్లీ స్టారర్లు

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. డబుల్ స్టార్డమ్‌తో ఓపెనింగ్స్‌ కూడా పెరుగుతాయి. కానీ ఇమేజ్‌ లెక్కలతో మల్టీస్టారర్స్‌కి వెనకాడుతున్నారు టాలీవుడ్ స్టార్లు. దీంతో ఫ్యామిలీ స్టారర్స్‌ వైపు వెళ్తున్నారు...

వైష్ణవ్ గట్టు ఎక్కుతాడా?

వైష్ణవ్‌ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పల్లె ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌ కొంచెం బరువైన పాత్రనే పోషించాడు. అయితే ఈ ఆశి క్యారెక్టర్‌లో...

వారసులు వస్తున్నారు కాచుకోండి

ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. సౌత్‌ నుంచి మొదలుపెడితే నార్త్‌ వరకు బోల్డంతమంది వారసత్వపు హీరోలు కనిపిస్తారు. అయితే తెలుగులో ఈ ఇయర్‌లోనే అరడజను వరకు వారసులు హీరోలుగా మారారు. ఇప్పటికే...

పవర్ స్టార్ దీ మెగాస్టార్ రూటే …

వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు. 2023 మార్చి లోపు కనీసం రెండు...

ఓటీటీ నీ ఒణికిస్తున్న అఖండ

అఖండ రిలీజై 50 రోజులు దాటినా మాస్ జాతరకు కామానే గానీ... ఫుల్‌స్టాఫ్‌ పడలేదు. కంటిన్యూ అవుతూనే వుంది. నిన్నటివరకు థియేటర్స్‌లో.. ప్రస్తుతం ఓటీటీలో అఖండ సృష్టిస్తున్న హవా అంతా ఇంతాకాదు.. ఓటీటీలో...

ప్రభుత్వ వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించిన ఉద్యోగులు 

నిత్యం జీతాలకోసమో, అదనపు సదుపాయాలకోసమో లేక పని భారం పెరిగిందనో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు చేస్తుంటారు. ఎక్కడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజలకు సదుపాయాలు లేవనో, మరే ఇతర ప్రజా సమస్యపైనో పోరాటం చెయ్యరు. ప్రపంచం తల్లకిందులైనా, ప్రక్రుతి ఆగ్రహించినా,...

హిట్టు పడితే చాలు

ఒక్క హిట్‌ పడితే రెమ్యునరేషన్‌ అమాంతం పెరిగిపోతుంది. స్టార్‌డమ్‌ వస్తే ఆలెక్కే వేరు. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో సక్సెస్‌ లేకపోయినా రెమ్యునరేషన్‌కు రెక్కలొస్తాయి. వరుసగా ఐదు హిట్స్‌తో పూజా హెగ్డేకు వచ్చిన...

ప్రభాస్ జోరు

ప్రభాస్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే. 2023 వరకు ఖాళీ లేనంత బిజీగా చేతిలో సినిమాలున్నాయి. సలార్‌... ఆదిపురుష్‌... నాగఅశ్విన్‌... సందీప్‌ వంగా సినిమాలు లైన్లో వున్నాయి. ఇవన్నీ పూర్తికావడానికి రెండేళ్లు...

అన్నీ వాయిదాలే!

కరోనా జీవితాలనే కాదు.. సినిమాలను చిందరవందర చేసేసింది. ముందుగా అనుకున్న డేట్‌కు ఒక్క సినిమా రావడం లేదు. పోస్ట్‌పోన్‌ చేసి మళ్లీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంటే.. మరో సినిమాతో క్లాష్‌ తప్పడం...