Wednesday, January 26, 2022

పాపం సిద్దూ..

సిద్ధార్థ్‌ ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాలతోపాటు పొలిటికల్‌ ఇష్యూస్‌పైనా ట్వీట్స్‌ పెడుతుంటాడు. ముఖ్యంగా మోడీ నిర్ణయాలని టార్గెట్ చెయ్యడంలో ముందుంటాడు. పొలిటీషియన్‌లా కామెంట్లు పెడుతుంటాడు. ఇదే స్పీడ్‌లో సైనా నెహ్వాల్‌కి సిద్ధు ఇచ్చిన రిప్లై బ్యాక్ ఫైర్ అవుతోంది.పంజాబ్‌ ఫిరోజ్‌పూర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. దీంతో ఈ టూర్‌ని అర్ధంతరంగా ముగించుకుని తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయాడు మోడీ. అయితే వెళ్తూ వెళ్తూ సురక్షితంగా తిరిగి వెళ్తున్నానని మీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీకి చెప్పండని పోలీస్‌ అధికారితో చెప్పాడట మోడీ. ఆ మాటతో పొలిటికల్ ఫైట్‌ మొదలైంది. ఈ పొలిటికల్‌ వార్ కాస్తా సైనా నెహ్వాల్, సిద్ధార్థ్‌ మధ్య వార్‌లా మారింది.రైతు చట్టాలకి వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో ఉద్యమం చేసినప్పుడు మోడీ ఫాలోవర్స్ అంతా రైతులని, పంజాబ్‌ వాసులని దేశద్రోహులు, ఖలిస్థానీలు అన్నట్లుగా విమర్శించారు. ఇప్పుడు పంజాబ్, ఫిరోజ్‌పూర్‌లో నిరసన వ్యక్తం చేసిన రైతులని కూడా ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రాన్ని ఉగ్రవాదుల అడ్డా అన్నట్లుగా ప్రొజెక్ట్‌ చేస్తున్నారు. ఈ పరిణామం దేశానికి మంచిది కాదని, దేశంలో అంతర్భాగమైన రాష్ట్ర ప్రతిష్ఠని దెబ్బతియ్యడం పద్దతికాదని, చాలామంది విమర్శిస్తున్నారు.సైనా నెహ్వాల్‌ ఇటీవల ప్రధాని భద్రత గురించి ట్వీట్ పెట్టింది. పీయంకి భద్రత లేకపోతే దేశం ఏం భద్రంగా ఉన్నట్లు అని ట్వీట్ చేసింది. దీనికి సిద్ధార్థ్ చిన్న కాక్‌తో ఆడుకునే వాళ్లు కాక్ అండ్ బుల్‌ స్టోరీస్‌ చెప్తున్నారు షేమ్‌ అన్‌ యు అని రిప్లై ఇచ్చాడు. దీంతో సైనాని సిద్ధార్థ్‌ అవమానించాడనే గొడవ మొదలంది. జాతీయ మహిళా కమీషన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే సిద్ధార్థ్‌ మాత్రం సైనా షటిల్‌ ప్లేయర్‌ కాబట్టి, కాక్ అండ్ బుల్‌ అని రిప్లై ఇచ్చాను. అంతేగానీ మరో అర్థం లేదని చెప్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

సై అంటున్న మాస్ మహారాజా…

క్రాక్‌ హిట్‌ తర్వాత రవితేజ నటించిన సినిమా ఖిలాడి. రమేష్‌ వర్మ దర్శకుడు. డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌ కాగా... ఇప్పటికే టీజర్.. మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమాగా...

మల్టీ స్టారర్లు కావు ఫ్యామ్లీ స్టారర్లు

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. డబుల్ స్టార్డమ్‌తో ఓపెనింగ్స్‌ కూడా పెరుగుతాయి. కానీ ఇమేజ్‌ లెక్కలతో మల్టీస్టారర్స్‌కి వెనకాడుతున్నారు టాలీవుడ్ స్టార్లు. దీంతో ఫ్యామిలీ స్టారర్స్‌ వైపు వెళ్తున్నారు...

వైష్ణవ్ గట్టు ఎక్కుతాడా?

వైష్ణవ్‌ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పల్లె ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌ కొంచెం బరువైన పాత్రనే పోషించాడు. అయితే ఈ ఆశి క్యారెక్టర్‌లో...

వారసులు వస్తున్నారు కాచుకోండి

ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. సౌత్‌ నుంచి మొదలుపెడితే నార్త్‌ వరకు బోల్డంతమంది వారసత్వపు హీరోలు కనిపిస్తారు. అయితే తెలుగులో ఈ ఇయర్‌లోనే అరడజను వరకు వారసులు హీరోలుగా మారారు. ఇప్పటికే...

పవర్ స్టార్ దీ మెగాస్టార్ రూటే …

వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు. 2023 మార్చి లోపు కనీసం రెండు...

ఓటీటీ నీ ఒణికిస్తున్న అఖండ

అఖండ రిలీజై 50 రోజులు దాటినా మాస్ జాతరకు కామానే గానీ... ఫుల్‌స్టాఫ్‌ పడలేదు. కంటిన్యూ అవుతూనే వుంది. నిన్నటివరకు థియేటర్స్‌లో.. ప్రస్తుతం ఓటీటీలో అఖండ సృష్టిస్తున్న హవా అంతా ఇంతాకాదు.. ఓటీటీలో...

ప్రభుత్వ వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించిన ఉద్యోగులు 

నిత్యం జీతాలకోసమో, అదనపు సదుపాయాలకోసమో లేక పని భారం పెరిగిందనో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు చేస్తుంటారు. ఎక్కడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజలకు సదుపాయాలు లేవనో, మరే ఇతర ప్రజా సమస్యపైనో పోరాటం చెయ్యరు. ప్రపంచం తల్లకిందులైనా, ప్రక్రుతి ఆగ్రహించినా,...

హిట్టు పడితే చాలు

ఒక్క హిట్‌ పడితే రెమ్యునరేషన్‌ అమాంతం పెరిగిపోతుంది. స్టార్‌డమ్‌ వస్తే ఆలెక్కే వేరు. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో సక్సెస్‌ లేకపోయినా రెమ్యునరేషన్‌కు రెక్కలొస్తాయి. వరుసగా ఐదు హిట్స్‌తో పూజా హెగ్డేకు వచ్చిన...

ప్రభాస్ జోరు

ప్రభాస్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే. 2023 వరకు ఖాళీ లేనంత బిజీగా చేతిలో సినిమాలున్నాయి. సలార్‌... ఆదిపురుష్‌... నాగఅశ్విన్‌... సందీప్‌ వంగా సినిమాలు లైన్లో వున్నాయి. ఇవన్నీ పూర్తికావడానికి రెండేళ్లు...

అన్నీ వాయిదాలే!

కరోనా జీవితాలనే కాదు.. సినిమాలను చిందరవందర చేసేసింది. ముందుగా అనుకున్న డేట్‌కు ఒక్క సినిమా రావడం లేదు. పోస్ట్‌పోన్‌ చేసి మళ్లీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంటే.. మరో సినిమాతో క్లాష్‌ తప్పడం...