Wednesday, January 26, 2022

అంతన్నాడు.. ఇంతన్నాడు… చివరికి ఢిల్లీ చేరిన రాజుగారు 

“అంతన్నాడు.. ఇంతన్నాడే గంగరాజు” అంటూ ఓ జానపద గీతం ఉంది. అది చేస్తా… ఇది చేస్తా… డొక్క చీరుస్తా… డోలు వాయిస్తా అంటూ డాంబికాలు పలికి చివరికి ఆ సమయం వచ్చేసరికి అడ్రస్ లేకుండా పోయాడంట ఎవరో గంగరాజు. ఇప్పుడు నర్సాపురం ఎంపీ రఘురామ  కృష్ణంరాజు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వస్తున్నా… నా సొంత ఊరు భీమవరం వస్తున్నా. ఇండిగో విమానంలో గన్నవరం వరకు వస్తా. అక్కడినుండి నా అభిమానులతో కలిసి భీమవరం వస్తా. రెండు రోజులపాటు అక్కడే ఉంటా. నాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భద్రతా సిబ్బంది ఉన్నారు. నా మనుషులు నా పర్యటన మొత్తం వీడియో తీస్తారు అంటూ ఏవేవో చెప్పుకొచ్చారు. సవాళ్ళు విసిరారు. తేల్చుకుందాం అన్నారు. ఎవరైనా ఏమైనా చేస్తే నా భద్రతా సిబ్బంది కాల్చివేస్తారు అని కూడా హెచ్చరికలు చేశారు.


ఈ హెచ్చరికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ సిఐడి అధికారులు నోటీసు ఇవ్వడంతో మరింత స్వరం పెంచారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది అన్నారు. రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది అన్నారు. చట్టాలు తెలుసు అన్నారు. అధికారులు ఇచ్చిన నోటీసు ప్రకారం ఈ నెల 17న హాజరవుతా అన్నారు. ఈ క్రమంలోనే అధికారులపై, ముఖ్యమంత్రిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చివరికి భీమవరం వచ్చిందీ లేదు, విచారణకు హారవుతారో లేదో కూడా తెలియదు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుని టీవీల వారితో యధావిధిగా రోజువారీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరోసారి ఆరోపణలు, నిందలు, గోదావరి వెటకారం అన్నీ చూపించారు.

గడిచిన రెండేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, ప్రతిపక్షం అయిన టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్న రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ముఖ్యమంత్రి తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. నిత్యం మీడియాలో కనిపిస్తూ ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సహచర పార్లమెంటు సభ్యులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, అవహేళనలు చేస్తూ కనిపిస్తున్న రఘురామ కృష్ణంరాజు తనను ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది అని చెప్పడం అంటే మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు ఉంది. ఇంకా చెప్పాలంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు ఉంది. ఈ రెండేళ్ళలో ఏ ఒక్కరోజు కూడా రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయని పరిస్థితి లేదు. నిత్యం ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ, ప్రతిపక్షానికి లబ్ది చేకూర్చేలా మాట్లాడుతూ వస్తున్న రఘురామ కృష్ణంరాజు ఇపుడు తనను ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్నారు అని అంటే ప్రజలు నమ్మేపరిస్థితి లేదు.


అయితే చంద్రబాబు నాయుడుకు  పూర్తిగా దగ్గర అయిన రఘురామ కృష్ణంరాజు టీడీపీ అధినేతలాగే అబద్దాలు అలవోకగా మాట్లాడడం నేర్చుకున్నారు. తాను ఏ తప్పు చేస్తారో దాన్నే ప్రత్యర్థులకు ఆపాదించడం చంద్రబాబు నాయుడు సహజ లక్షణం. ఆ లక్షణాన్ని రఘురామ కృష్ణంరాజు పుణికిపుచ్చుకున్నారు. అందుకే అంతన్నారు… ఇంతన్నారు … అక్కడికి వస్తా… ఎక్కడికైనా వస్తా అన్నారు. చివరికి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

సై అంటున్న మాస్ మహారాజా…

క్రాక్‌ హిట్‌ తర్వాత రవితేజ నటించిన సినిమా ఖిలాడి. రమేష్‌ వర్మ దర్శకుడు. డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌ కాగా... ఇప్పటికే టీజర్.. మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమాగా...

మల్టీ స్టారర్లు కావు ఫ్యామ్లీ స్టారర్లు

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. డబుల్ స్టార్డమ్‌తో ఓపెనింగ్స్‌ కూడా పెరుగుతాయి. కానీ ఇమేజ్‌ లెక్కలతో మల్టీస్టారర్స్‌కి వెనకాడుతున్నారు టాలీవుడ్ స్టార్లు. దీంతో ఫ్యామిలీ స్టారర్స్‌ వైపు వెళ్తున్నారు...

వైష్ణవ్ గట్టు ఎక్కుతాడా?

వైష్ణవ్‌ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పల్లె ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌ కొంచెం బరువైన పాత్రనే పోషించాడు. అయితే ఈ ఆశి క్యారెక్టర్‌లో...

వారసులు వస్తున్నారు కాచుకోండి

ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. సౌత్‌ నుంచి మొదలుపెడితే నార్త్‌ వరకు బోల్డంతమంది వారసత్వపు హీరోలు కనిపిస్తారు. అయితే తెలుగులో ఈ ఇయర్‌లోనే అరడజను వరకు వారసులు హీరోలుగా మారారు. ఇప్పటికే...

పవర్ స్టార్ దీ మెగాస్టార్ రూటే …

వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు. 2023 మార్చి లోపు కనీసం రెండు...

ఓటీటీ నీ ఒణికిస్తున్న అఖండ

అఖండ రిలీజై 50 రోజులు దాటినా మాస్ జాతరకు కామానే గానీ... ఫుల్‌స్టాఫ్‌ పడలేదు. కంటిన్యూ అవుతూనే వుంది. నిన్నటివరకు థియేటర్స్‌లో.. ప్రస్తుతం ఓటీటీలో అఖండ సృష్టిస్తున్న హవా అంతా ఇంతాకాదు.. ఓటీటీలో...

ప్రభుత్వ వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించిన ఉద్యోగులు 

నిత్యం జీతాలకోసమో, అదనపు సదుపాయాలకోసమో లేక పని భారం పెరిగిందనో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు చేస్తుంటారు. ఎక్కడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజలకు సదుపాయాలు లేవనో, మరే ఇతర ప్రజా సమస్యపైనో పోరాటం చెయ్యరు. ప్రపంచం తల్లకిందులైనా, ప్రక్రుతి ఆగ్రహించినా,...

హిట్టు పడితే చాలు

ఒక్క హిట్‌ పడితే రెమ్యునరేషన్‌ అమాంతం పెరిగిపోతుంది. స్టార్‌డమ్‌ వస్తే ఆలెక్కే వేరు. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో సక్సెస్‌ లేకపోయినా రెమ్యునరేషన్‌కు రెక్కలొస్తాయి. వరుసగా ఐదు హిట్స్‌తో పూజా హెగ్డేకు వచ్చిన...

ప్రభాస్ జోరు

ప్రభాస్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే. 2023 వరకు ఖాళీ లేనంత బిజీగా చేతిలో సినిమాలున్నాయి. సలార్‌... ఆదిపురుష్‌... నాగఅశ్విన్‌... సందీప్‌ వంగా సినిమాలు లైన్లో వున్నాయి. ఇవన్నీ పూర్తికావడానికి రెండేళ్లు...

అన్నీ వాయిదాలే!

కరోనా జీవితాలనే కాదు.. సినిమాలను చిందరవందర చేసేసింది. ముందుగా అనుకున్న డేట్‌కు ఒక్క సినిమా రావడం లేదు. పోస్ట్‌పోన్‌ చేసి మళ్లీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంటే.. మరో సినిమాతో క్లాష్‌ తప్పడం...