Tuesday, July 5, 2022

కావిళ్ల భాగ్యం గాదెల్లో ధాన్యం సంక్రాంతి స్పెషల్ రాజకీయాలు డాట్ కామ్ పాఠకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.

కావిళ్ల భాగ్యం గాదెల్లో ధాన్యం

సంక్రాంతి స్పెషల్

రాజకీయాలు డాట్ కామ్ పాఠకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.

మకర సంక్రాంతి అంటే ఏమిటనేకదా మీ అనుమానం. ఏం లేదండి…కాలానికి మూలం సూర్యుడు. సూర్యుడు కదలడు. అతని చుట్టూ అన్ని గ్రహాలూ తిరుగుతూంటాయి.మనకు మాత్రం సూర్యుడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలా కదులుతూ నెలకోరాశిలోకి మారుతూంటాడు సూర్యుడు. అలా ప్రతి నెలా సంక్రాంతి వస్తూనే ఉంటుంది. దాన్ని మాస సంక్రాంతి అంటారు. మరి ఏడాదికి ఒకసారొచ్చే సంక్రాంతి స్పెషాల్టీ ఏమిటొ ఇప్పుడు చూద్దాం.


సంవత్సరకాలాన్ని రెండు ముక్కలుగా విడకొట్టారన్నమాట. ఆ లెక్క ప్రకారం ఉత్తరాయణం…దక్షిణాయనం అంటారు.
కర్ణాటక రాశిలోకి సూర్యుడు మారినప్పటినుంచి ఆరునెలల కాలాన్ని లెక్కగట్టి దక్షిణాయనం అంటారు. మకరరాశిలోకి మారిన తర్వాత వచ్చే ఆరునెల్లనీ ఉత్తరాయణం అంటారు. సూర్యుడు మకర రాశిలోకి మారుతున్న సమయంలో జరుపుకునే పండగే మకర సంక్రాంతి. సాధారణంగా ఏడాది పొడుగునా ఎన్నో పండుగలు వస్తూంటాయి. మిగతా పండగలన్నీ ఒక్క రోజు జరుపుకుంటారు. కానీ సంక్రాంతి పండగను మాత్రం నెల రోజుల పాటు జరుపుకుంటారు. ముగ్గులు, హరిదాసులు, డూడూ బసవన్నలు..గంగిరెద్దు మేళాలతో పల్లెలన్నీ మోతోక్కిపోతాయి. బంధువుల సందడితో ఇల్లిల్లూ కళకళలాడిపోతుంది. ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆనందం తాండవిస్తుంది. కొత్త పంటలు చేతికొచ్చాక…ఒక్కసారి పితృదేవతలకు నైవేద్యం పెట్టి ఏడాది పొడుగునా జయం కలిగేలా ఆశీర్వదించమని కోరడం సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రధాన కార్యక్రమం. పితృదేవతలను అర్చించడమే ఈ పండుగ ప్రత్యేకత.


పెద్దలు తరించే పండుగ కాబట్టి దీనిని పెద్దపండుగ అన్నారు. అంతే కాదు …సంక్రాంతి కుర్రాళ్ల పండగ. చలికాలంలో వచ్చే పండగ కాబట్టి సందళ్లు కూడా కాస్త హద్దు మీరినట్టు అనిపిస్తాయి. పితృదేవతలు దక్షిణాయనమంతా ప్రయాణించి, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తమలోకాలలోకి అడుగు పెడతారని పురాణాలు చెపుతున్నాయి. దక్షిణాయనంలో నిద్రపోయిన మహావిష్ణువు ఉత్తరాయనంలో మేలుకొంటాడంటారు. అందుకే ఉత్తరాయనాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఆ శుభ ఘడియల కోసమే భీష్ముడు అంపశయ్య మీద వేచి ఉన్నాడు అని భారతంలో స్పష్టంగా ఉంది. సంక్రాంతి పండగ రోజుల్లో హరిదాసు కీర్తనలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. తిండి పెట్టే బసవన్నను పూజించి, కృతజ్ఞతను చూపించేది సంక్రాంతి పండగకే. తెలుగునాట బావమరదళ్ళ సరస సంభాషణలను చూపేది కూడా సంక్రాంతి పండగే. గొబ్బెమ్మల పూజ ద్వారా అన్ని పదార్థాలలోనూ దైవాన్ని దర్శించగలిగే హృదయం భారతీయులకు ఉందని చెప్పే పండగే సంక్రాంతి. ప్రకృతి అందాలకు పల్లెలే పట్టుకొమ్మలని చెప్పేది ఒక్క సంక్రాంతి పండుగే. పౌష్యలక్ష్మి , సంక్రాంతి లక్ష్మి, మకరలక్ష్మి పేర్లతో పిల్చుకునే ఈ పండుగను లక్ష్మి రూపంగానే భావిస్తారు.
ఇక ప్రతి పండగా ఏదో ఒక దేవతను కొల్చుకోడానికి చేస్తారు. సంక్రాంతి మాత్రమే మన సంస్కృతిని, ముఖ్యంగా తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తుంది.అందుకే ఈ పండుగకు సాంస్కృతిక ప్రాధాన్యత ఏర్పడింది.
సంక్రాంతి కి పంటలు ఇంటికి రావడం అనేది పల్లె ప్రజల్ని హుషారులో ముంచే విషయం. కష్టించే రైతులకు ఏడాది పొడుగునా పడ్డ కష్టానికి ఫలితం ఇంటికి చేరే సందర్భం.


అందుకే సంక్రాంతిలో శ్రమైక జీవన సౌందర్యాన్ని చూస్తారు. ఏడాది పొడుగునా తమకు వ్యవసాయంలో సాయం చేసిన చేతి వృత్తుల వారికీ…పశు సంపదకూ…తమ ఇంటికి చేరిన సంపదను పంచడం సంక్రాంతి సందర్భంగా జరిగే పెద్ద వేడుక.
ఈ ఇచ్చిపుచ్చుకోడాలే…పండగ…యవసాయానికి రైతన్నకు తోడునీడగా నిలిచేది పశుసంపదే. అందుకే పశుసంపదను కొలవడం మన సంప్రదాయం. గోవు మాలక్ష్మికి కోటి దండాలు అంటాడు ఆరుద్ర ఓ సినిమా పాటలో. పాడి పంటలు అనే పదబంధంలోనే పశుసంపదతో మన జీవితాలు ముడిపడి ఉన్నాయనే విషయం అర్ధం కావడం లేదూ..
సంక్రాంతి రైతన్నల పండగ. పల్లె సీమల పండగ. తమ జీవితాల్లో కలగలసిని ప్రతి జీవినీ సత్కరించుకునే సందర్భం. పొలాలమ్ముకుని పోయేవారికి, పాలిటిక్స్ లో చేరి పదవులు స్థిరమని భ్రమసే వారికీ …వాళ్లకే కాదు…ఒళ్లు వంచి చాకిరి మళ్లని వారెవరికీ సంక్రాంతి లో ఉన్న సమష్టి జీవన సౌందర్యం బొత్తిగా అర్ధం కాదు ఈ విషయం…అప్పుడెప్పుడోనే కొసరాజు చెప్పేశారు.
ఈనాటి సంక్రాంతి – అసలైన పండగ… సిసలైన పండగ… కష్టజీవులకు ఇది ఎంతో కమ్మనిపండగ’ అని పాడుకొనే శ్రమజీవులు ఇంకా చెమటోడ్చటం వల్లనే పట్ణణాలకూ నగరాలకూ కూడు అందుతోంది. మన భాగ్యసీమలు పల్లెటూళ్లు…పాడిపంటలకే కాదు…మంచితనం మమకారాలకూ పల్లెలే పుట్టిళ్లు.


కొలని దోపరికి గొబ్బిళ్ళో.. అంటూ అన్నమయ్య కీర్తన ఉంటుంది. సంక్రాంతి ముగ్గులకూ గొబ్బిళ్లకూ చాలా ప్రాధాన్యత ఇస్తారు అమ్మాయిలు. ముగ్గులు చెరిపినా…గొబ్బెమ్మల్ని తొక్కినా జీవితాంతం క్షమించరు. సంక్రాంతి శోభ అంతా కన్నెపిల్లలదే…సిగ్గును చీరగ కప్పుకుని…చిలిపిగ ఓరగ తప్పుకుని…ముసిముసి చూపులూ…రుస రుస నవ్వులూ కలియబోసి ముగ్గులు పెట్టేస్తారు.
కావిళ్ల భాగ్యం…గాదెల్లో ధాన్యం…కష్టించే రైతులకు కలకాలం సౌఖ్యం…ఈ సంక్రాంతి జనావళికి శుభం పూయాలని మనసారా కోరుకుంటూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....