Wednesday, January 26, 2022

మెగాస్టార్ మాట‌ల వెనుక..

ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా మెగాస్టార్ చిరంజీవి ఈ ఉదయం ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌ల్సారు. అయితే ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తాను ఇండ‌స్ట్రీ పెద్ద‌గా రాలేద‌నీ బిడ్డ‌గానే వ‌చ్చాన‌న్నారు. ముఖ్య‌మంత్రి ఆహ్వానం మేర‌కే త‌ను ఆయ‌న్ని క‌ల్సిన‌ట్టు చెప్పారు. ఇండ‌స్ట్రీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌న్నీ ఆయ‌న దృష్టికి తీసుకుపోయిన‌ట్టు చెప్తూ… టిక్కెట్ల ధ‌ర‌లు పెంచుతారా లేదా అనేది నేను చెప్ప‌లేనుగానీ … ఒక సానుకూల నిర్ణ‌యం అయితే వెలువ‌డే అవకాశం ఉంద‌న్నారు. ఆయ‌న చెప్పిన గ‌డువు ఒక‌టి రెండు వారాలు. ఇండ‌స్ట్రీ పెద్ద‌లంద‌రితోనూ క‌ల‌సి రావ‌డ‌మా? ల‌లేక త‌న‌కు ఒక్క‌డికే పిలుపు వ‌స్తే … ఒక్క‌డిగా రావ‌డ‌మో తిరిగి మ‌రోసారి సిఎం ను క‌లుస్తాన‌నే విష‌యం కూడా తెలిపారు.


దాదాపుగా మంత్రి పేర్ని నానిని క‌ల్సిన‌ప్పుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చెప్పారో అదే చిరంజీవి కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం. ముఖ్య‌మంత్రి చాలా సానుకూలంగా ఉన్నారు. సావ‌ధానంగా విన్నారు. స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రించ‌డానికి త‌న వంతు చేస్తాన‌ని హామీ ఇచ్చారు కొన్ని విష‌యాలు నోట్ చేసుకున్నారు. ప‌రిస్తితి మొత్తం క‌మిటికి వివ‌రించి త‌గిన న్యాయం జ‌రిగేట్టు చూస్తాన‌న్నారు. దాదాపు మాట‌ల తేడా త‌ప్ప ఇదే వ‌ర్మ కూడా చెప్పింది. అయితే ఏపీ ప్ర‌భుత్వం ఏం ఆలోచిస్తోందీ అన్న‌ది సుస్ప‌ష్టంగా చెప్ప‌న‌ప్ప‌టికీ ఒక విష‌యం స్ప‌ష్టం చేశారు. స‌రిగ్గా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య‌మంత్రిని క‌లుస్తున్న సంద‌ర్భంలోనే మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ … త‌క్కువ ధ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు వినోదాన్ని అందించే విష‌యంలో ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తి ఉండ‌క‌పోవ‌చ్చ‌న్నారు. దాదాపు ఇదే విష‌యం చిరంజీవి కూడా చెప్పారు క‌నుక ధ‌ర‌ల త‌గ్గింపు విష‌యం ఉండ‌దు.
అస‌లు వివాదం టిక్కెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు గురించి కాద‌నీ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా మొద‌టి వారం రోజులూ టిక్కెట్ల రేట్లు పెంచి అమ్ముకోవ‌డం, బెన్ ఫిట్ షోస్ వేసుకోవ‌డానికి అనుమ‌తులు అలాగే నెంబ‌ర్ ఆఫ్ షోస్ విష‌యంలో పట్టు ప‌ట్ట‌వ‌ద్ద‌నే అంశాల పైనే సినీ ప‌రిశ్ర‌మ ఏపీ ప్ర‌భుత్వంతో దెబ్బ‌లాడుతోంద‌నేది సినీ విశ్లేష‌కుల వాద‌న‌.


ఈ విష‌యంలో కొంత ప‌ట్టు విడుపుల‌తో వ్య‌వ‌హించేందుకు సిఎం ఏదో మేర‌కు అంగీకారం చూపించారా లేక అలాంటి ఇండికేష‌న్స్ ఇచ్చారా అనేది ఇప్పుడు ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌, దాదాపు రెండు వారాల త‌ర్వాతే నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని మెగాస్టార్ చెప్పిన‌దాన్ని బ‌ట్టి ఆచార్య‌, భీమ్లానాయ‌క్ సినిమాలు ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రుకు షెడ్యూల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయ‌ని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాసెస్ లోనే … రాథేశ్యామ్ , ట్రిపుల్ ఆర్ సినిమాలు కూడా స‌మ్మ‌ర్ వార్ కు ర‌డీ అవుతాయ‌నే మాట కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఈ స‌మావేశం ద్వారా ఇండ‌స్ట్రీలో త‌న పెద్ద‌రికాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అయ్యింద‌ని మెగాభిమానులు చెప్పుకుంటున్నారు. అలాగే ఇటీవ‌ల మా ఎన్నిక‌ల్లో మెగా క్యాంపు నుంచీ పోటీ చేసిన ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ ఓట‌మి త‌గిలించిన‌ షాకు నుంచీ మెగాభిమానులు కోలుకోడానికి ఇదో టానిక్ గా మారింది అని కూడా కొన్ని స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.


మొత్తానికి చిరంజీవి ప‌ర్య‌ట‌న సినిమా ప‌రిశ్ర‌మ కూ ఏపీ ప్ర‌భుత్వానికీ మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం పరిష్కారం దిశ‌గా సానుకూల ప‌డింద‌నే అభిప్రాయం అయితే వినిపిస్తోంది. దోపిడీ నియంత్ర‌ణ అంటూ ప్ర‌భుత్వం చేసిన వాద‌న‌ల మేర‌కు కొన్ని క‌ఠిన నిబంధ‌న‌ల మ‌ధ్యే ఈ వెసులుబాట్ల‌కు అవ‌కాశాలు క‌ల్పించే అవ‌కాశం ఉంద‌న్న‌ట్టు క‌నిపిస్తోంది. సిఎం కూడా విష‌యాన్ని సంక్లిష్టం చేయ‌డం కంటే … ప్ర‌జానుకూలంగా ఓ స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని అనుకోవ‌డం వ‌ల్లే ఈ స‌మావేశం జ‌రిగింద‌నే మాట బెజ‌వాడ గాంధీన‌గ‌ర్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

సై అంటున్న మాస్ మహారాజా…

క్రాక్‌ హిట్‌ తర్వాత రవితేజ నటించిన సినిమా ఖిలాడి. రమేష్‌ వర్మ దర్శకుడు. డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌ కాగా... ఇప్పటికే టీజర్.. మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమాగా...

మల్టీ స్టారర్లు కావు ఫ్యామ్లీ స్టారర్లు

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. డబుల్ స్టార్డమ్‌తో ఓపెనింగ్స్‌ కూడా పెరుగుతాయి. కానీ ఇమేజ్‌ లెక్కలతో మల్టీస్టారర్స్‌కి వెనకాడుతున్నారు టాలీవుడ్ స్టార్లు. దీంతో ఫ్యామిలీ స్టారర్స్‌ వైపు వెళ్తున్నారు...

వైష్ణవ్ గట్టు ఎక్కుతాడా?

వైష్ణవ్‌ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పల్లె ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌ కొంచెం బరువైన పాత్రనే పోషించాడు. అయితే ఈ ఆశి క్యారెక్టర్‌లో...

వారసులు వస్తున్నారు కాచుకోండి

ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. సౌత్‌ నుంచి మొదలుపెడితే నార్త్‌ వరకు బోల్డంతమంది వారసత్వపు హీరోలు కనిపిస్తారు. అయితే తెలుగులో ఈ ఇయర్‌లోనే అరడజను వరకు వారసులు హీరోలుగా మారారు. ఇప్పటికే...

పవర్ స్టార్ దీ మెగాస్టార్ రూటే …

వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు. 2023 మార్చి లోపు కనీసం రెండు...

ఓటీటీ నీ ఒణికిస్తున్న అఖండ

అఖండ రిలీజై 50 రోజులు దాటినా మాస్ జాతరకు కామానే గానీ... ఫుల్‌స్టాఫ్‌ పడలేదు. కంటిన్యూ అవుతూనే వుంది. నిన్నటివరకు థియేటర్స్‌లో.. ప్రస్తుతం ఓటీటీలో అఖండ సృష్టిస్తున్న హవా అంతా ఇంతాకాదు.. ఓటీటీలో...

ప్రభుత్వ వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించిన ఉద్యోగులు 

నిత్యం జీతాలకోసమో, అదనపు సదుపాయాలకోసమో లేక పని భారం పెరిగిందనో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు చేస్తుంటారు. ఎక్కడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజలకు సదుపాయాలు లేవనో, మరే ఇతర ప్రజా సమస్యపైనో పోరాటం చెయ్యరు. ప్రపంచం తల్లకిందులైనా, ప్రక్రుతి ఆగ్రహించినా,...

హిట్టు పడితే చాలు

ఒక్క హిట్‌ పడితే రెమ్యునరేషన్‌ అమాంతం పెరిగిపోతుంది. స్టార్‌డమ్‌ వస్తే ఆలెక్కే వేరు. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో సక్సెస్‌ లేకపోయినా రెమ్యునరేషన్‌కు రెక్కలొస్తాయి. వరుసగా ఐదు హిట్స్‌తో పూజా హెగ్డేకు వచ్చిన...

ప్రభాస్ జోరు

ప్రభాస్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే. 2023 వరకు ఖాళీ లేనంత బిజీగా చేతిలో సినిమాలున్నాయి. సలార్‌... ఆదిపురుష్‌... నాగఅశ్విన్‌... సందీప్‌ వంగా సినిమాలు లైన్లో వున్నాయి. ఇవన్నీ పూర్తికావడానికి రెండేళ్లు...

అన్నీ వాయిదాలే!

కరోనా జీవితాలనే కాదు.. సినిమాలను చిందరవందర చేసేసింది. ముందుగా అనుకున్న డేట్‌కు ఒక్క సినిమా రావడం లేదు. పోస్ట్‌పోన్‌ చేసి మళ్లీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంటే.. మరో సినిమాతో క్లాష్‌ తప్పడం...