Thursday, May 26, 2022

రాజీనామా సవాల్ ను మే14 వరకూ వాయిదా వేసుకున్న రఘురామ 

నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు తన రాజీనామా సవాల్ ను మరోసారి పొడిగించారు. మొదట జనవరి 7న తన పార్లమెంటు సభ్యత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తా అంటూ తన అను’కుల’ మీడియాకు లీకులిచ్చారు. ఆ తర్వాత జనవరి నెలాఖరు నుండి ఫిబ్రవరి 5 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని, ఆ సమావేశాల తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మే 14 తర్వాత రాజీనామా చేస్తా అంటూ కొత్త మెలిక పెట్టారు. రాజీనామా చేస్తా, మళ్ళీ పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలుస్తా అంటూ సవాలు చేసిన రఘురామ కృష్ణంరాజు వరుసగా వాయిదా వేస్తూ వస్తున్నారు.


వాయిదా వేసుకున్న ప్రతిసారీ తాను తన పార్టీ నాయకత్వానికి ఒక అవకాశం ఇస్తున్నా అంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. గెలిచే సత్తా ఉంటే, రికార్డు మెజారిటీ సాధించే ధైర్యం, విశ్వాసం ఉంటే ఇలా వాయిదాలు వేసుకోవడం ఎందుకు? ఏకంగా రాజీనామా చేయొచ్చుగా? పైగా అనేక సందర్భాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం అసమర్ధ నాయకత్వం అని ప్రకటిస్తూ వచ్చిన రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు మళ్ళీ తన రాజీనామాకు నాయకత్వ సమర్థతతో ముడిపెట్టడం ఎందుకు?
ఇన్నేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకుంటూ తిరుగుతున్న రఘురామ కృష్ణంరాజు ఇప్పటికి వామపక్ష పార్టీలు తప్ప అన్ని పార్టీలచుట్టూ తిరిగారు. ఇన్నేళ్ళలో ఏ పార్టీ కూడా ఆయనకు కనీసం అసెంబ్లీ టిక్కెట్టు కూడా ఇవ్వలేదు. ఆయన కూడా స్వంతంగా ఎక్కడా పోటీ చేసి గెలిచిందీ లేదు. చివరికి 2019 లో జగన్మోహన్ రెడ్డి భిక్షతో నర్సాపురం పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు గెలిచిన ఆరోనెల నుండే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, సహచర పార్లమెంటు సభ్యులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగా పనిచేయడం మొదలు పెట్టారు. అప్పటి నుండి నేటివరకు నిత్యం కుల మీడియాలో సొంత పార్టీ నాయకత్వంపై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలతో పాటు వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేసి తన చిల్లర బుద్ధిని, లేకితనాన్ని చాటుకుంటున్నారు.


తాను ఏ పార్టీ సింబల్ పై గెలిచి పార్లమెంటు సభ్యుడు అయ్యారో ఆ పార్టీకి, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తూ తెరచాటున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకూల రాజకీయం చేస్తున్నారు. అయితే ఆ పార్టీని విమర్శిస్తూ సమర్ధించుకుంటున్న రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీ పెట్టిన భిక్షను మాత్రం వదులుకోలేక పోతున్నారు. ఆ పార్టీ ఇచ్చిన పదవి, ఆ పదవితో లభించే అవకాశాలను వాడుకుంటూనే ఆ పార్టీ నాయకత్వాన్ని నిత్యం విమర్శిస్తూ ప్రతిపక్షాలకు అనుకూలంగా రాజకీయం చేయడం ఆయనకే చెల్లింది. ఈ దిగజారుడు తనాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటే జనం చూస్తూ ఊర్కోవడానికి ఇవి ఈనాడు, ఆంధ్ర జ్యోతి మాత్రమే ఉన్న రోజులు కావు. ఇవి సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న రోజులు.


ఇక రాజీనామా చేసిన తర్వాత తనకోసం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వందలాదిగా ప్రజలు నర్సాపురం వచ్చి పనిచేస్తారని కూడా రఘురామ కృష్ణంరాజు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. అంతటితో ఆగక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన పులివెందుల నుండి కూడా రెడ్డి కుల ప్రతినిధులు తనకు ప్రచారం చేయడానికి వస్తారని చెప్పుతున్నారు. అసలు రెడ్డి అనేది కులం కాదని, అది ఒక గుర్తింపు అని, చివరికి జగన్మోహన్ రెడ్డి కానీ, అయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కానీ, ఆపైన రాజారెడ్డి కానీ రెడ్డి కులం వారు కాదని, వారు కాపులని చెప్పారు. అలాగే ఆయన రాష్ట్రంలో, ప్రత్యేకించి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్లను తిట్టని రోజు లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, పార్లమెంటు పార్టీ నేత విజయసాయి రెడ్డిని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కేంద్రంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అలాంటిది కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు వచ్చి తన విజయం కోసం పనిచేస్తారు అని చెప్తుంటే ఆయన గాలిలో మేడలు ఏ స్థాయిలో కడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇంత ధైర్యం, విశ్వాసం ఉంటే వాయిదాలు వేయకుండా వెంటనే రాజీనామా చేసి తన సత్తా చాటుకోవచ్చు. అంతే కానీ ఏవో మంగళవారం సాకులు చూపి మద్దెల ఓడు అన్న కబుర్లు చెపితే జనం నవ్వుతారు అని కూడా లేకపోతే ఏం చేయగలం?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....