రవితేజ ‘క్రాక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. వరుస ఫ్లాపులతో కెరీర్ కష్టాల్లో పడిన టైమ్‌లో ‘క్రాక్’ కావల్సినంత ఎనర్జీ ఇచ్చింది. ఇక ఈ జోష్‌తో రవితేజ స్పీడ్ పెంచాడు. యంగ్ డైరెక్టర్లు, సీనియర్లు అనే లెక్కలు చూడకుండా వరుస సినిమాలకి సైన్ చేశాడు. ‘ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వర్రావు, ధమాకా’ సినిమాలతో బిజీ అయ్యాడు.
రవితేజ నెక్ట్స్ ‘మానాడు’ రీమేక్‌లో నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. తమిళ్లో శింబు హీరోగా చేసిన ఈ సినిమాని తెలుగులో రవితేజ చేస్తాడనే టాక్ వస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీతోనే శింబు మళ్లీ హిట్ కొట్టాడు. ‘విన్నైతాండి వరువాయ’ తర్వాత సరైన హిట్‌లేని శింబుకి మళ్లీ ‘మానాడు’తోనే సక్సెస్ వచ్చింది. ఇప్పుడీ కథనే రవితేజ రీమేక్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.
సురేశ్ బాబు నిర్మాణంలో ‘మానాడు’ రీమేక్ తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రవితేజకి స్టోరీ లైన్ చెప్పారట. కంప్లీట్ స్క్రీప్ట్ రెడీ అయ్యాక ఫైనల్ వెర్షన్ నెరేట్ చేసి, రవితేజ ఓకే చెప్పగానే సినిమాని సెట్స్‌కి తీసుకెళ్తారట. మరి ఈ రీమేక్‌ని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.