కరోనా జీవితాలనే కాదు.. సినిమాలను చిందరవందర చేసేసింది. ముందుగా అనుకున్న డేట్‌కు ఒక్క సినిమా రావడం లేదు. పోస్ట్‌పోన్ చేసి మళ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే.. మరో సినిమాతో క్లాష్ తప్పడం లేదు. ఆర్ఆర్ఆర్, లాల్‌సింగ్ చద్దా కొత్త రిలీజ్ డేట్స్ ఏయే సినిమాలను ఇబ్బంది పెడుతున్నాయో చూద్దాం.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత కెజిఎఫ్ 2 కొత్త రిలీజ్ డేట్‌తో ముందుకొచ్చింది. చాలా నెలలు క్రితమే ఏప్రిల్14న రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. అయితే డిసెంబర్లో రావాల్సిన అమీర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’ ఇదే డేట్‌కు రావడంతో….పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు.అంచనాలు లేకుండా రిలీజైన కెజిఎఫ్ కన్నడతోపాటు… తెలుగు, హిందీలో కూడా విజయం సాధించింది. యశ్ ఎవరో తెలీకపోయినా… హిందీప్రేక్షకులు ఆదరించారు. దీంతో పాన్ ఇండియా మార్కెట్ కోసం కెజిఎఫ్2లో విలన్‌గా సంజయ్‌దత్‌ను తీసుకున్నారు. తీరాచూస్తే… ఏప్రిల్ 14న అమీర్‌ఖాన్ సినిమాలో పోటీపడాల్సి వస్తోంది.
సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రావడంతో…. ఎఫ్3 వెనక్కి తగ్గి ఏప్రిల్ 29కు వెళ్లింది. వరుణ్ బర్త్‌డే సందర్భంగా ఈమధ్యనే ఒకరోజు ముందుకొచ్చి ఏప్రిల్ 28న వస్తామని ప్రకటించారు మేకర్స్. ఇదే రోజు ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఆప్షన్‌గా ఎంచుకోవడంతో… ఎఫ్3 మరోసారి వెనక్కి తగ్గుతుందా? లేదంటే.. పోటీకి సై అంటుందో తెలియాల్సి వుంది. కరోనా సిట్యువేషన్ ఎలా వుంటుందో ఇప్పుడే చెప్పలేం కాబట్టి రాజమౌళి రెండు విడుదల తేదీలు ఎనౌన్స్ చేశాడు. వాతావరణం అనుకూలంగా వుంటే… మార్చి 18.. లేదంటే.. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది.
ఆర్ఆర్ఆర్ విషయంలో ప్లాన్ బి వర్కవుట్ అయ్యే అవకాశం వుంది. ప్లాన్ ఎ మార్చి 18న రిలీజ్ రాలేకపోతే… ప్లాన్‌బి ఏప్రిల్ 28న విడుదలవుతుంది. అందులోనూ ఇది బాహుబలి2 రిలీజైన డేట్ కావడంతో… సెంటిమెంట్ కూడా కలిసొస్తుంది. ప్లాన్ బి వర్కవుట్ అయితే .. .ఎఫ్ 3 మరోసారి రిలీజ్‌డేట్ మార్చుకోక తప్పదు.