Thursday, May 26, 2022

ప్రభాస్ జోరు

ప్రభాస్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే. 2023 వరకు ఖాళీ లేనంత బిజీగా చేతిలో సినిమాలున్నాయి. సలార్‌… ఆదిపురుష్‌… నాగఅశ్విన్‌… సందీప్‌ వంగా సినిమాలు లైన్లో వున్నాయి. ఇవన్నీ పూర్తికావడానికి రెండేళ్లు పడుతుంది. రీసెంట్‌గా మరో రెండు సినిమాలు వార్తల్లో నిలిచాయి. ఓ హిందీ డైరెక్టర్‌తోపాటు.. తెలుగు దర్శకుడు మారుతి కూడా వున్నాడు.ప్రభాస్ మారుతితో ఓ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని.. RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య మరియు ‘ఆచార్య’ నిర్మాత నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారన్న ప్రచారం సాంగింది. మారుతి గతంలో తీసిన ప్రేమ కథా చిత్రం మాదిరి హారర్‌ కామెడీగా వుంటుందని… ‘రాజా డీలక్స్‌’ అన్న టైటిల్ పెట్టారన్న వార్త చక్కర్లు కొట్టింది.Maruthi reacts to 'Raja Deluxe' with Prabhas - Movie Newsపాన్ ఇండియా స్టార్‌ మారుతి దర్శకత్వంలో నటించడం ఏంటన్న డౌట్‌ చాలామందికి వచ్చింది. అయితే పెద్దగా ఇమేజ్ లేని.. ఒక సినిమా అనుభవం వున్న సుజిత్‌తో సాహో… రాధాకుమార్‌తో రాధేశ్యామ్‌తో తీయగాలేనిది…. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతికి ఛాన్స్ ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ప్రభాస్‌ సినిమాపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు మారుతి ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు. ”నా ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ – టైటిల్‌ – జానర్‌పై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్నింటికీ కాలమే వెల్లడిస్తాయని మారుతి పేర్కొన్నాడు. ప్రభాస్‌తో సినిమా వుంటుందని …వుండదని చెప్పకుండా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చాడు మారుతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....