Thursday, May 26, 2022

ప్రభుత్వ వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించిన ఉద్యోగులు 

నిత్యం జీతాలకోసమో, అదనపు సదుపాయాలకోసమో లేక పని భారం పెరిగిందనో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు చేస్తుంటారు. ఎక్కడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజలకు సదుపాయాలు లేవనో, మరే ఇతర ప్రజా సమస్యపైనో పోరాటం చెయ్యరు. ప్రపంచం తల్లకిందులైనా, ప్రక్రుతి ఆగ్రహించినా, కల్లోలాలు వచ్చినా ఇలా ఏ ఉపద్రవం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ పట్టదు. కానీ తమకు ఓ గంట పని సమయం పెంచినా, ఒక రూపాయి జీతం పెంచకపోయినా ప్రభుత్వాలను అడ్డగించేస్తారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతోంది కూడా ఇదే.


ప్రపంచం మొత్తం కోవిడ్ తో అల్లకల్లోలం అవుతోంది.  లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.  బ్రతికి ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజులు గడుపుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా మార్చి 2020 నుండి ఏ దేశమూ, ఏ రాష్ట్రమూ, ఏ సమాజమూ స్థిమితంగా లేదు. మొత్తం ఆర్ధిక వ్యవస్థ కుదేలు అయింది. రూపాయి రాబడి లేదు. పైగా కోవిడ్ తో పోరాటం కోసం ప్రభుత్వాలు, ప్రజలు తమ దగ్గర ఉన్న చివరి రూపాయి కూడా ఖర్చు చేస్తున్నారు.
లక్షలాది మంది దినసరి కూలీలకు పనిదొరకడం కష్టంగా ఉంది. పని లేక, రోజుకూలీ రాక రోజుగడవడం దుర్భరంగా మారింది. అలాగే లక్షలాది మంది ప్రైవేటురంగంలో ఉన్న వేతన జీవులు ఉద్యోగాలు కోల్పోయారు. వాళ్ళు కుటుంబాలతో సహా రోడ్డున పడ్డారు. ప్రవేటు రంగంలో ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలు కూడా ఆయా సంస్థలు కోవిడ్ పేరు చెప్పి నెల జీతంలో భారీ కోత విధిస్తే పంటి బిగువున కుటుంబాలను పోషించుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇంత జరిగినా రూపాయి కూడా నష్టం లేకుండా బ్రతుకుతున్నది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. లాక్ డౌన్ సమయంలో వారికి అసలు పనే లేదు. ఇంట్లోనే కూర్చున్నారు. అయినా వారికి పూర్తి జీతం వచ్చింది. ఇప్పుడు కూడా పని అంత పెద్దగా లేదు. ఒక్కరి ఉద్యోగమూ పోలేదు. ఒక్కరి జీతమూ తగ్గలేదు. ప్రవేటు రంగంలో ఉన్న వారితో పోల్చినా, రోజుకూలీలతో పోల్చినా, కాంట్రాక్టు ఉద్యోగులతో పోల్చినా ఎవరి జీవితాలు ఎంత తలక్రిందులైనా కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉన్నది ఒక్క ప్రభుత్వ ఉద్యోగులే. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ పరిస్థితుల్లో ఇలా జీతాల పెరుగుదల కోసం రోడ్డెక్కడం రోతపుట్టిస్తోంది.

ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదు. నెలకు 50 వేల రూపాయల జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను చదువుకోసం నెలకు 15 వేల రూపాయల జీతం తీసుకుని ప్రవేటు పాఠశాలలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడి దగ్గరకు పంపిస్తున్నారు. ఇలా చేయడంలో వారికి కాస్త కూడా తలవంపు అనిపించకపోవడం ఆశ్చర్యకరం. అలాగే ఒక్క ప్రభుత్వ వైద్యుడు కూడా తన పిల్లలకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించడు. ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వం నుండి జీతం. పనులన్నీ ప్రవేటులో. ఇదీ వీరి వరుస.
ఇక ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రజలకు సేవలు సరిగా అందే పరిస్థితి లేదు. లంచం ఇవ్వందే పని జరిగే పరిస్థితి లేదు. వేల రూపాయల జీతం తీసుకుంటూ సంతకం పెట్టేందుకు లంచం అడగడం ఆ వ్యవస్థలోని నిర్లజ్జకు నిలువెత్తు ఉదాహరణ. లంచం లేనిదే కన్నెత్తి కూడా చూడరు. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజల్లో ఎలాంటి సానుభూతి కూడా లేదు.జనం గుక్కెడు గంజికోసం అల్లాడుతుంటే బిర్యానీ కోసం, పరమాన్నం కోసం ఉద్యమం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపట్ల సమాజంలో ఏవగింపు పెరుగుతోంది. ప్రజలకు రూపాయి పని కూడా చేయకుండా మొత్తం వ్యవస్థకు కళంకం తెచ్చేలా తయారయింది ఉద్యుగస్తుల వ్యవస్థ. ఈ వ్యవస్థ ఇంత దిగజారడం మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు తమ పట్ల ప్రజల్లో ఎలాంటి ఏహ్య భావం కలుగుతోందో గ్రహించి తమ పద్ధతులు మార్చుకుంటే మంచిది. ప్రభుత్వ ఉద్యోగి పని చేయడం ఇప్పటికైనా మొదలు పెట్టాలి. అప్పుడు సమాజం వారిని గౌరవిస్తుంది. వారికి అండగా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....