ఒక్క హిట్ పడితే రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోతుంది. స్టార్డమ్ వస్తే ఆలెక్కే వేరు. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో సక్సెస్ లేకపోయినా రెమ్యునరేషన్‌కు రెక్కలొస్తాయి. వరుసగా ఐదు హిట్స్‌తో పూజా హెగ్డేకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతాకాదు. అల వైకుంఠపురంలో సూపర్‌హిట్ తర్వాత పూజా తగ్గేదే లేదంటూ.. 3 కోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది.పూజా హెగ్డే రెమ్యునరేషన్ 3 కోట్లు దాటిపోవడంతో.. కీర్తిసురేష్, రష్మిక కూడా పూజాతో పోటీపడుతున్నారన్నది టాక్. పూజాకు అల వైకుంఠపురంలో ఎలాగో.. పుష్ప సినిమా రష్మిక రెమ్యునరేషన్‌ను పెంచేసింది. అప్పటివరకు 2కోట్ల రేంజ్లో వున్న ఈ కన్నడ బ్యూటీ.. ప్రస్తుతం 3కోట్లకు పైగా డిమాండ్ చేస్తోందట. పుష్ప అన్ని భాషల్లో హిట్ కావడంతో… పుష్ప2 కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలిసింది.
క్రాక్ హిట్ తర్వాత శృతిహాసన్ రెమ్యునరేషన్ పెంచేసింది. క్రాక్ ముందు వరకు శృతిహాసన్ పారితోషికం వార్తల్లో వినిపించలేదు. గబ్బర్‌సింగ్ హిట్ తర్వాత రేసుగుర్రంతో సక్సెస్ఫుల్ హీరోయిన్గా ముద్రపడడంతో.. ఈ అమ్మడు రెమ్యునరేషన్ కోటి దాటిపోయింది. అయితే బాలయ్య సినిమాతో ఫస్ట్ టైం 2 కోట్ల మార్క్ దాటింది
ఈమధ్యకాలంలో రెమ్యునరేషన్ పెంచేసిన మరో హీరోయిన్ మెహ్రీన్. ప్రస్తుతం ఎఫ్3 మూవీ చేస్తోంది. ఎఫ్2, మహానుభావుడు వంటి హిట్స్‌లో నటించినా… ఇంతవరకు కోటి దాటలేదు. ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీలో నాజూగ్గా కనిపించి యూత్‌తో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంది. 50…60 లక్షల్లో వున్న మెహ్రీన్ రెమ్యునరేషన్ కోటి దాటిపోయిందట. కోటి ఇస్తేనే సైన్ చేస్తానంటోంది మెహ్రీన్.
పూజా… రష్మిక మాదిరి క్రితి శెట్టి కూడా హ్యాట్రిక్ కొట్టింది. ఉప్పెన తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్.. బంగార్రాజు హిట్ కావడంతో లక్కీ హీరోయిన్ అన్న ముద్ర పడింది. ఈబ్రాండ్ కోటి రూపాయిల హీరోయిన్ని చేసింది. డెబ్యూ మూవీ ఉప్పెనలో ఈ అమ్మడి రెమ్యునరేషన్ 10 లక్షలు అయితే.. ప్రస్తుతం కోటి దాటింది. కృతి ఇప్పుడు ‘ది వారియర్’లో రామ్ పక్కన .. “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో సుధీర్‌బాబుతో కలిసి నటిస్తోంది.