అఖండ రిలీజై 50 రోజులు దాటినా మాస్ జాతరకు కామానే గానీ… ఫుల్‌స్టాఫ్ పడలేదు. కంటిన్యూ అవుతూనే వుంది. నిన్నటివరకు థియేటర్స్‌లో.. ప్రస్తుతం ఓటీటీలో అఖండ సృష్టిస్తున్న హవా అంతా ఇంతాకాదు.. ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది.
మాంచి హైప్‌తో రిలీజైన అఖండకు హిట్ టాక్ రావడంతో… ఎ.పి మినహా అన్ని చోట్లా వారం లోపే బ్రేక్ ఈవెన్ అయింది. మూడు వారాలు దాటినా… థియేటర్స్‌లో మంచి రన్‌తో దూసుకుపోయింది. అఖండ తర్వాత పుష్ప… శ్యామ్ సింగరాయ్ వంటి హిట్స్ పడినా… థియేటర్స్లోంచి అఖండ వెళ్లకుండా.. సంక్రాంతి సీజన్ కూడా నడిచింది.సినిమా ఎంత హిట్ అయినా…. ఆడేది నాలుగైదు వారాలు మాత్రమే. కానీ అఖండ 50 రోజుల వరకు థియేటర్స్‌లో మాస్ జాతర నడిచింది. పుష్ప రిలీజైన మూడు వారాలకే ఓటీటీలోకి వస్తే… అఖండ 50 రోజుల తర్వాత ఓటీటీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అయింది. 50 రోజుల తర్వాత వచ్చిన అఖండను ఓటీటీలో ఎవరు చూస్తారులే అనుకుంటే.. థియేటర్స్‌లో సౌండ్ బాక్సులు… ఓటీటీలో రికార్డులు బద్దలయ్యాయి.
తెలుగులో ఇప్పటివరకు రిలీజైన ఓటీటీ సినిమాల్లో అఖండ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో మిలియన్ మంది సినిమాను చూశారు. థియేటర్స్‌లో 50 రోజులు ఆడిన సినిమాకు ఓటీటీలో ఇంతమంది చూడడం ఓటీటీ వర్గాలకు షాక్ ఇచ్చింది. అఖండను చూడాలనుకున్నా… కరోనా కారణంగా చూడలేకపోయిన వాళ్లు చాలామంది ఓటీటీని ఆశ్రయించారన్నమాట. ఆల్రెడీ చూసినవాల్లే మళ్లీ చూడడంతో 24 గంటల్లో 10 లక్షలమంది సినిమాను చూసివుంటారని