Thursday, May 26, 2022

పవర్ స్టార్ దీ మెగాస్టార్ రూటే …

వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు. 2023 మార్చి లోపు కనీసం రెండు సినిమాలైనా రిలీజుకు పెట్టేయాలనుకున్నాడు. ఈ ప్రాసెస్ లోనే భీమ్లా నాయక్ తెరకెక్కించారు. దాని తర్వాత క్రిష్ మూవీ హరిహరవీరమల్లు పట్టాలెక్కాలి … ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ యాక్టివిటీ అంతా కంప్లీట్ అయిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి.భీమ్లా నాయక్ కంప్లీట్ అయినా … పవన్ హరిహర వీరమల్లు పాత్రలోకి ప్రవేశించడం లేదుPawan Kalyan's next titled 'Hari Hara Veera Mallu'

కారణం ఏమిటి అని వాకబు చేయగా కొండపొలం అని తెలుస్తోంది. నిజానికి కథానాయకుడు మహానాయకుడు సినిమాల దెబ్బ తర్వాత క్రిష్ కోలుకుని చేసిన సినిమా కొండపొలం. కొండపొలం కన్నా ముందే పవన్ మూవీ కమిట్మెంట్ జరిగింది.
అప్పటికి భీమ్లానాయక్ సెట్స్ మీదుండడంతో దీన్ని దాని తర్వాత అన్నారు. ఆ గ్యాప్ లో తనను తాను ప్రూవ్ చేసుకోడానికి అన్నట్టు కొండపొలం ఎటెమ్ట్ చేశాడు క్రిష్.
నెగెటివ్ టాక్ రావడంతో కొండపొలం ఆడలేదు. పోయింది పోతూ పవన్ మూవీ అవకాశాన్ని కూడా లాక్కుపోయిందనేది ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. అయితే డైరెక్టర్ సన్నిహితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హరిహర విరమల్లు ఉంటుందనే అంటున్నారు. పవన్ చేయను అని కన్ఫర్మ్ గా చెప్పలేదు అంటున్నారు. అయితే క్రిష్ ను బైపాస్ చేసి సముద్రఖని తో సినిమా చేయడానికి పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారనే మాట కూడా బలంగానే వినిపిస్తోందిGautamiputra Satakarni director Krish gets 4 offers from B-Town; RGV  confirms - IBTimes Indiaపవన్ తో సినిమా చేయాలనుకున్న వారెవరికీ ఆయన నో చెప్పడం లేదు. కానీ కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. గత ఎన్నికలప్పుడు పవన్ సినిమా కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ కు వచ్చేసిందనే అనుకున్నారంతా … తీరా ఆయన పార్టీకి ఒక్కసీటు మాత్రమే రావడం అది కూడా వైసీపీ వైపు వెళ్లిపోవడంతో కాస్త డైలమాలో పడ్డ పవన్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించి సినిమాలవైపు టర్నింగ్ ఇచ్చుకుని అందర్నీ ఆశ్చర్యపరచారు. అలా వకీల్ సాబ్ తెరకెక్కి సక్సస్ అయ్యింది.ఆ వెంటనే భీమ్లానాయక్ స్టోరీ లైన్ కు ఓకే అన్నాడు. కష్టకాలంలో గబ్బర్ సింగ్ లాంటి అద్దిరిపోయే హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ కు కూడా ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు వపన్ కళ్యాణ్. అలాగే ఒకప్పుడు ఖుషీ మూవీతో తన ఇమేజ్ ను ఎక్కడికో తీసుకుపోయిన రత్నం కూ బాస చేశాడు.కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే … క్రిష్ తో పాటు వీళ్లందరినీ బైపాస్ లో పెట్టేసి తమళ డైరెక్టర్ తో ట్రావెల్ అవడానికే పవన్ నిర్ణయించుకున్నాడనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.పవన్ మూవీ మీద గంపెడు ఆశలు పెట్టుకున్న క్రిష్ ఇప్పుడు పవన్ ఇలా చేస్తాడనుకోలేదు అని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు టాక్ . సినిమా లేదనే మాట మాత్రం ఓపెన్ గా ఎవరూ అనడం లేదు. అలాగే హరీష్ శంకర్ సినిమా కూడా ఉందనే చెప్తున్నారు … ఇదంతా చూస్తుంటే … ఒకప్పుడు చిరంజీవి విజయబాపినీడు కథ గుర్తొస్తోంది అంటున్నారు సీనియర్లు.
చిరంజీవికి మగమహారాజు, మగధీరుడు , గ్యాంగ్ లీడర్ లాంటి అద్దిరిపోయే హిట్స్ ఇచ్చిన విజయబాపినీడు బిగ్ బాస్ లాంటి ఒక్క ఫ్లాప్ ఇవ్వగానే ఆయన్ని తన మనసులోంచీ తుడిచేశారు మెగాస్టార్.Why did Megastar Chiranjeevi don a spooky avatar find out in the storyఅయితే లౌక్యంగా వ్యవహరించే చిరంజీవి ఆ మాట ఎన్నడూ బైటకు అనలేదు. చిరంజీవి ప్రతి పుట్టిన రోజుకీ విజయబాపినీడు వెళ్లి చిరంజీవిని కల్సి విషెస్ చెప్పడం .. ఈ ఏడాది మనం సినిమా చేస్తున్నాం … మంచి స్క్రిప్టుతో రండి అని ఆయన చెప్పడం … ఈయన నాలుగైదు కథలు రడీ చేసుకుని వెళ్లడం అవి వాయిదా పడడం ఇలా జరిగింది తప్ప … బిగ్ బాస్ తర్వాత తిరిగి బాపినీడుతో సినిమా చేయలేదు బిగ్ బాస్.Chiranjeevi Bond With Vijaya Bapineedu | Telugu Filmnagarఒక దశలో దర్శకుడు విఎన్ ఆదిత్య డైరెక్షన్ లో మెగాస్టార్ మూవీ అని బాపినీడు అనౌన్స్ చేశారుగానీ మెగాస్టార్ పచ్చజండా ఊపలేదు. అదీ కొంత కాలం నాని ఆగిపోయింది.
నిజానికి ఈ అనుభవం ఆదిత్యకు కొత్తేం కాదు… అంజనా ప్రొడక్షన్స్ లో వచ్చిన ఏకైక హిట్టు బావగారూ బావున్నారాకి ఎక్కువ శ్రమ పడింది ఆదిత్యే. ఆ టైటిల్ పెట్టింది కూడా తనే. ఆ టైమ్ లో ఆదిత్య మీద ప్రేమ పుట్టుకొచ్చిన మెగాస్టార్ మంచి స్క్రిప్టు తెచ్చుకో సినిమా చేస్తున్నాం అనడంతో ఆదిత్య కష్టపడి ఓ లైన్ రాసుకొచ్చి మెగాస్టార్ కు చెప్పాడు. ఆయన ఓకే చేశాడు.
అది కూడా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే అనుకున్నారు . ముహూర్తం కూడా జరిగింది. ఈ లోగా ఆదిత్యకు బాస్ అనే ఫ్లాప్ రాడంతో ఈ ముహూర్తం ఫొటోలకే పరిమితం అయిపోయింది.
దాదాపు పవన్ కూడా ప్రస్తుతం ఎఎమ్ రత్నం , క్రిష్ లతో అలాగే వ్యవహరిస్తున్నాడనేది ఇండస్ట్రీ సీనియర్లు అంటున్నమాట …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....