వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పల్లె ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్ కొంచెం బరువైన పాత్రనే పోషించాడు. అయితే ఈ ఆశి క్యారెక్టర్లో హెవీ ఎమోషన్‌తో పాటు బోల్డ్ రొమాన్స్ కూడా ఉంది. జల జల జలపాతం అనే ఒకే ఒక్క పాటతో రొమాంటిక్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు.వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ‘రంగ రంగ వైభవంగా’ అనే సినిమా చేస్తున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో వైష్ణవ్‌తేజ్‌తో కేతిక శర్మ జోడీ కట్టింది. ‘రొమాంటిక్’ సినిమాలో కంప్లీట్ బోల్డ్‌గా యాక్ట్ చేసిన కేతిక, ఈ ‘రంగ రంగ వైభవంగా’లో కూడా రొమాంటిక్ టచ్‌లోనే కనిపిస్తోంది. రీసెంట్గా రిలీజైన టీజర్లో బటర్‌ఫ్లై కిస్ అంటూ వైష్ణవ్ తేజ్, కేతిక హంగామా చేశారు.
వైష్ణవ్ తేజ్ వరుసగా లిప్‌లాకులు, రొమాంటిక్ సీన్స్ చెయ్యడంతో ఈ హీరోని అంతా టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అని పిలుస్తున్నారు. కంప్లీట్ మాస్ హీరోలున్న మెగాఫ్యామిలీలో రొమాంటిక్ హీరోగా మారుతున్నాడని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ రొమాంటిక్ మూవీస్‌తో మెగారొమాంటిక్ స్టార్‌గా ఫిక్స్ అయిపోతాడేమో చూడాలి.