క్రాక్ హిట్ తర్వాత రవితేజ నటించిన సినిమా ఖిలాడి. రమేష్ వర్మ దర్శకుడు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ కాగా… ఇప్పటికే టీజర్.. మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమాగా సెట్స్‌పైకి వచ్చిన ఖిలాడి పాన్ ఇండియా మూవీగా మారుతోంది.రవితేజా సినిమాల హిందీ డబ్బింగ్స్ యు ట్యూబ్‌లో పాపులర్ అయ్యాయి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు చూస్తున్నారు. సినిమాను హవీష్ ప్రొడక్షన్స్‌తోపాటు.. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తోంది. దీంతో… సినిమాను తెలుగుతోపాటు హిందీలో కూడా డబ్చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
బాహుబలి పాన్ ఇండియా సినిమాలకు ఊపిరిపోస్తే.. పుష్ప 90 కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్స్కు ఉత్సాహం ఇచ్చింది. ఈక్రమంలో ఖిలాడి కూడా హిందీలోకి అడుగుపెడుతోందని సమాచారం. పెన్ ఇండియా నిర్మాణ భాగస్వామ్యం కావడంతో… థియేటర్స్ దొరుకుతాయి. మరి బాలీవుడ్ ప్రేక్షకులను టాలీవుడ్ ఖిలాడి ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.