Tuesday, July 5, 2022

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు … తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు.
కానీ ఇప్పుడు టాలీవుడ్ కి దిగుమతైన ఓ బాలీవుడ్ హీరోయిన్ను కొత్త పాట పాడుతోంది. అదేంటనగా …
నిన్నటి దాకా ట్రిపుల్ ఆర్ గురించీ … జూనియర్ ఎన్టీఆర్ సరసన తను చేయబోయే మరో తెలుగు మూవీ గురించీ మాట్లాడుతూ వచ్చిన అలియా భట్ లుక్స్ మారాయి.Alia Bhatt turns entrepreneur, launches kidswear brand Ed-a-mammaప్రస్తుతం తన చూపు అల్లు అర్జున్ మీద పడింది. అల్లు అర్జున్ తో మూవీ చేయాలనేది తన డ్రీమ్ అంటూ మాట్లాడేస్తోంది.ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పైగా ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ కు అలియా డుమ్మా కొట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.కొరటాల శివ తో కళ్యాణ్ రామ్ నిర్మాతగా రాబోతున్న జూనియర్ మూవీ లో తనకు పెయిర్ గా అలియాను ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు.అలాంటిది ఆ మూవీ ఈవెంట్ కు రాకపోవడం … బన్నీ గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉండడం … తో లేనిపోని అనుమానాలు మొదలయ్యాయి.NTR - Koratala Siva - Janatha Garage Shoot from Feb 22nd - Adya Newsఅదేంటి తను మాట్లాడాల్సింది ట్రిపుల్ ఆర్ లో తన పెయిర్ రామ్ చరణ్ గురించి లేదా తను చేయబోయే మూవీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించీ కదా … వీళ్లిద్దర్నీ ఒదిలేసి అసలు ఏ మాత్రం సంబంధం లేని బన్నీ భజన చేస్తోందేమిటీ అందరూ చెవులు కొరుక్కుంటున్న వేళ … తెల్సిన విషయం ఏమిటంటే … దానికీ ఓ రీజనుందని .ఉన్నట్టుండి అల్లు అర్జున్ మీదకు ఇలా లుక్స్ ఛేంజ్ చేయడం ఏమిటని వాకబు చేస్తే … తెల్సిన ఆసక్తి కరమైన వార్త ఏమిటంటే … అల్లు అర్జున్ నటించిన పుష్ప బాలీవుడ్ లో క్రియేట్ చేసిన బజ్ ఇందుకు కారణం అని …అలియా భట్ ఇంట్లో వాళ్లందా పుష్ప చూసేయడమే కాదట … చూపే బంగారమాయనే అంటూ వంకర నడకలు వయ్యారంగా నడిచేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారటPushpa Box Office (Hindi): With Over 300% ROI, Allu Arjun Starrer Isn't  Flower, It's Fire At The Ticket Windows!అలా చేస్తే చేశారులే అనుకుంటే … అలియా నువ్వు ఎటూ తెలుగు మూవీస్ చేస్తున్నావు కదా … ఆ చేసేదేదో బన్నీ పక్కన చేయవచ్చు కదా అని దాదాపు బతిమాలేస్తున్నారట …దీంతో అలియా తన దగ్గరకు వచ్చిన తెలుగు నిర్మాతల్నీ డైరెక్టర్లనీ పట్టుకుని మీ హీరో అల్లు అర్జున్ అయితే చెప్పండి … వెంటనే డేట్స్ ఇచ్చేస్తా అంటోందట …అలా బాలీవుడ్ లో పుష్ప క్రేజ్ పెరడం ఇప్పుడు ఇతర తెలుగు హీరోలకు తలనొప్పిగా మారింది. ఏది ఏమైనా తమ హీరో మూవీ ఈవెంట్ కు అలియా హ్యాండ్ ఇవ్వడం మాత్రం తప్పే అంటూ మండిపడుతున్నారు జూనియర్ ఫాన్స్ … మారి వార్ని అలియా ఎలా కూల్ చేస్తుందో చూడాలి మరి …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....