Tuesday, July 5, 2022

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు సినిమా రంగం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే కుప్పలు తెప్పలుగా తెలుగు సినిమా రంగం నుండి అనేకమంది వచ్చి కలుస్తారు. అభినందిస్తారు. చంద్రబాబు నాయుడు కోసం సినిమా రంగం నుండి చాలా మంది ఎన్నికల ప్రచారం చేస్తారు. అలాగే టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం పాటలు, స్వల్ప నిడివి చిత్రాలు, తీసి తమ స్వామి భక్తిని చాటుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఒకరిద్దరు మినహా ఎవరూ వచ్చి ఆయనను కలవలేదు, అభినందించలేదు.


సినిమా రంగంపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టడంతో తెలుగు చిత్ర సీమ ఖంగుతింది. వందలు, వేల రూపాయలు టిక్కెట్లపై పెంచి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వానికి నామమాత్రం పన్నులు చెల్లిస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి టికెట్ ధరలపై, టికెట్ విక్రయాలపై నిబంధనలు విధించారు. దీంతో దిమ్మతిరిగిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు గత తొమ్మిది నెలలుగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి వచ్చింది. కొందరు సినీ ప్రముఖులు రాష్ట్ర మంత్రి పేర్ని నానిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కూడా జనవరి నెలలో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత ఈ రోజు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, పోసాని కృష్ణ మురళి, అలీ వంటి వారిని వెంటబెట్టుకుని చిరంజీవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు.


ఈ సందర్భంగా టికెట్ ధరపై ముఖ్యమంత్రి కొంత వెసులుబాటు కల్పించారు. అలాగే సినిమాల ప్రదర్శనపై కూడా కొంత వెసులుబాటు కల్పించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ కు విస్తరించాల్సిన ఆవశ్యకత గురించి చిరంజీవి బృందానికి ముఖ్యమంత్రి తెలియజేశారు. విశాఖపట్నం సినిమా పరిశ్రమకు అనుకూలంగా ఉంటుందని, అక్కడ స్టూడియోలు నిర్మించుకోవడానికి, ఇళ్ళు నిర్మించుకోడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో అనేక ప్రాంతాలు సినిమా షూటింగులకు అనువుగా ఉంటాయని, షూటింగులు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.


మొత్తానికి తెలుగు సినిమా బృందం జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. చిరంజీవితో పాటు హీరోలు ప్రభాస్ మరియు మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని, ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల చూపించిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. రాజమౌళి అయితే ముఖ్యమంత్రి స్పందించిన విధానానికి ముగ్దుణ్ణయ్యాను అన్నారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేక అవగాహనకు ప్రతినిధి బృందం అబ్బురపడింది. బహుశా అందుకే ఈ బృందంలో ఆర్ నారాయణ మూర్తి ఉండాల్సి వచ్చింది. నారాయణమూర్తికి ప్రత్యేక గౌరవం కూడా లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....