Tuesday, July 5, 2022

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సినిమాలకు వస్తున్న ఆదాయంలో అరవై శాతం కంట్రిబ్యూట్ చేస్తున్న ఏపీలో చిత్రపరిశ్రమ అభివఈద్ది చెందడానికి సహకరించవలసినదిగా కోరారు. అందుకోసం కావల్సిన సకల సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాన్ని విశాఖలో సినిమా పరిశ్రమ కోసం కేటాయిస్తాం అని హామీ ఇచ్చారు. సినిమా తీసేవారే కాదు చూసేవారు కూడా ఇబ్బంది పడకూడదన్నారు. అందుకే టిక్కెట్ల ధరల పెంపుకు సంబంధించి అందరు చెప్పిన అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని సముచిత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.
అలాగే ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఏనాడూ వ్యతిరేకం కాదన్నారు. కేవలం అందరికీ ఆమోదయోగ్యమైన విధానం కోసమే కాస్త విస్తఈతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నాం తప్ప మరోటి కాదన్నారు. ఏపీలో షూటింగులు జరుపుకునే వారికి రాయితీలు కల్పించడం కోసం కూడా ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తోందన్నారు.
తమ ప్రభుత్వ ఆలోచన సినిమా పరిశ్రమకు మేలు చేయడంతో పాటు ప్రజలకు వినోదం భారం కాకుండా చూడడం కూడా అన్నారు. ప్రజల పట్ల బాధ్యతతోనే ఏ ప్రభుత్వమైనా వ్యవహరించాల్సి ఉందని గుర్తు చేశారు. ఏ వర్గానికో తరగతికో మేలు కలిగించడం కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కోడానికే తాము ప్రాధాన్యత ఇచ్చామన్నారు. దీన్ని పరిశ్రమలోని వారికి అర్ధం చేయించడంతో పాటు వారి ఫీడ్ బ్యాక్ తీసుకోడానికే హీరోలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.టిక్కెట్ల రేట్లు పెంచడం వల్ల చిన్న సినిమాలకూ ఉపయోగం కలిగితే మంచిదే అన్నారు. ఎవరినీ నష్టపరచాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదనే విషయం గుర్తించాలని విజ్ఒప్తి చేశారు.
టిక్కెట్ల రేట్లు పెంచితే చిన్న సినిమా బతుకుతుందా?

టిక్కెట్ల రేట్లు పెంచితే చిన్న సినిమాలకు ఉపయోగం ఉంటుందా? అనేది ప్రశ్న. టిక్కెట్ల రేట్లు అన్ని సినిమాలకూ సమానంగా ఉండాలని పరిశ్రమ తరపున ఇవాళ ముఖ్యమంత్రిని కల్సిన అగ్రహీరోలు కోరారు. దీనివల్ల చిన్న సినిమాలకు కూడా ఆదాయం పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. అయితే సినిమా టిక్కెట్ల రేట్లు పెంచడం వల్ల చిన్న సినిమాలకు నష్టమే జరుగుతుందనే అభిప్రాయం కూడా పరిశ్రమలోని కొన్ని వర్గాల వారు వాదిస్తున్నారు.
తెలంగాణలో సింగిల్ థియేటర్లలో బాల్కనీ టిక్కెట్ల రేట్లు నూటయాభైకి పెంచారు. అలా పెంచిన తర్వాత విడుదలైన ఏ చిన్న సినిమానూ జనం థియేటర్లకు వచ్చి ఆదరించలేదు.కారణం టిక్కెట్ల రేట్లు భారం కావడమే … మల్టీ ప్లెక్సుల్లో నూట యాభై పెట్టి సినిమా చూడలేకే సింగిల్ స్క్రీన్లకు వస్తుంటే ఇక్కడా నూటయాభై చేసేస్తే మేమెటుపోవాలంటున్నారు జనం.తర్వాత ఎలాగూ డిజిటల్ ప్లాట్పామ్ మీదకు సినిమా వచ్చాక చూద్దాం అనే అభిప్రాయం ఇప్పటికే చాలా మంది మధ్యతరగతి ప్రజల్లో వచ్చేసింది కనుక ఇలా టిక్కెట్ల రేట్లు పెంచడం అనేది చిన్న సినిమాలను థియేటర్లకు దూరం చేస్తుందని వారు వాదిస్తున్నారు.టిక్కెట్ల రేట్లు పెంచడం వల్ల చిన్న సినిమాలకు పెద్ద లాభాలు అనే మాట పూర్తిగా అర్ధం లేనిదనీ వారు వాపోతున్నారు. పెద్ద హీరోల సినిమాలు ఓపెనింగ్స్ రాబడుతాయి కాబట్టి రేట్లు పెంచితే లాభపడతాయనీ … చిన్న సినిమాలకు మౌత్ పబ్లిసిటీ యే ప్రాణం కనుక టిక్కెట్ల రేట్ల పెంపు వాటిని చంపేస్తుందనీ వారి వాదనలోని సారాంశం. మరి దీనికి సినిమా పెద్దలు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సి ఉంటుంది.

 తాడేపల్లిలో పెద్ద హీరోల డ్రామా ?

మొత్తానికి ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడింది … అని మీడియా ముందు అగ్రహీరోలు ప్రకటించేశారు. చిన్న సినిమాల కోసం ఐదో ఆటకు అంగీకరించిన ముఖ్యమంత్రికి థాంక్స్ అని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన దాన్ని బట్టి టిక్కెట్ల రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వం అంగీకరించిందనే విషయం అందరికీ అర్ధమయ్యింది.
నిజానికి పెద్ద హీరోల గొడవ టిక్కెట్ల రేట్ల పెంపు కోసం కాదు … తెలంగాణలో నూటయాభై ఉంది బాల్కనీ టిక్కెట్లు ఏపీలో నూట పది రూపాయలు ఉంది … నలభై రూపాయల గొడవగా దీన్ని చూపించే ప్రయత్నం పెద్ద హీరోలు చాలా కాలంగా చేస్తున్నారు. కానీ విషయం అది కాదు …దీని వెనకాల ఉన్న మతలబు ఏమిటంటే? పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు మొదటి వారం టిక్కెట్ల ధరలు పెంచుకోడానికి ప్రభుత్వం అనుమతించాలి అనే … అలాగే నంబర్ ఆఫ్ షోస్ వేసుకునే ఛాన్స్ ఇవ్వాలి … అలాగే బెన్ ఫిట్ షోస్ వేసుకోడానికి అనుమతివ్వాలి … ఈ డిమాండ్ల గురించి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం తో సమస్య పరిష్కారం అయిపోయిందని పెద్ద హీరోలు ప్రకటించేసినట్టున్నారు అని బయట వినిపిస్తున్న మాట.నిజానికి ఏపీ ప్రభుత్వం ఈ దోపిడీని అదుపు చేయడానికే … టిక్కెట్ల రేట్ల నియంత్రణ టిక్కెట్ల అమ్మకం ప్రభుత్వం చేపడుతుందని ప్రకటించింది.ఇలా అయితే … పెద్ద సినిమాలు తీయలేమని పరిశ్రమ వైపు నుంచీ సన్నాయినొక్కులు నొక్కారు అందరూ .. దీని మీద ప్రభుత్వం కూడా తన వాదనను వినిపించింది.అయితే మూడు నాలుగు లేయర్లలో కథలు నడపడానికి అలవాటు పడ్డ సినిమా వాళ్లు … వ్యూహాత్మకంగా ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల దారుణంగా వ్యవహరిస్తోందనీ … ఇలా అయితే … తెలుగు సినిమా రంగం షట్ డౌన్ అయిపోతుందని ముఖ్యమంత్రి అర్ధం చేసుకోవాలనీ … ఆక్రోశించారు.ఇదందా ఉత్తుత్తి ఏడుపులే … నిజానికి వాళ్ల గొడవ కేవలం తమ సినిమాలకు టిక్కెట్ల ధరలు ఇష్టానుసారం పెంచుకోడానికి అనుమతించమనే … పైగా టిక్కెట్ల రేట్లు పెంచుకోడానికి పరిశ్రమ వారికి అవకాశం ఇవ్వాలని ప్రజలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేంతగా ఈ డ్రామాను రక్తి కట్టించారు సినిమా వాళ్లు.
చివరకి విషయాన్ని తెగేదాకా లాగడం సరికాదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ సినీనటులను చర్చలకు పిల్చారు.
టిక్కెట్ల ధరల వ్యవహారంలో సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే సందర్భంలో తన మనసులోని మరో కోరికను వీరి ముందుంచారు సిఎం.ఒక్క తెలంగాణలోనే కాదు … ఏపీలో కూడా చిత్ర పరిశ్రమ వర్ధిల్లాలి కదా … అందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి తగిన సదుపాయాలు కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని చాలా పెద్దమనసుతో ప్రతిపాదించారు.
ఈ అవకాశాన్ని కూడా తమకు అనుకూలంగా వాడుకోడానికి తప్పకుండా సిఎంగారు ప్రతిపాదించిన విషయాన్ని పరిశీలిస్తాం … ఇక్కడ కూడా పరిశ్రమ ఏర్పాటుకు మేం దోహదం చేస్తాం అని ప్రకటించేశారు మెగాస్టార్ చిరంజీవి.
హైద్రాబాద్ లో స్థలాలు గట్రా తీసుకున్నది చాలక … ఇప్పుడు ఏపీలోనూ మళ్లీ స్థలాలు పొందేయడానికి రడీ అయిపోయారు. ఎక్కడైనా మేమే అన్నట్టు వ్యవహరించారు.నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలకు అద్దం పట్టే సినిమాలు తీసే కళాకారులకు తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే … వారు ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ వేళ్లూనుకోడానికి దోహదపడతారు. అలా కాక మళ్లీ అక్కడా వీళ్లకే పెద్ద పీట వేస్తే జరిగే ప్రయోజనం ఏమీ ఉండదని ముఖ్యమంత్రి ఆశయం రాళ్లపాలౌతుందని మెగాస్టార్ చిరంజీవి మాటలు విన్న చాలా మంది ఔత్సాహికులు వాపోతున్నారు.మరో వైపు టిక్కెట్ల రేట్లు పెంచడం పెద్ద సినిమాలకు ప్రయోజనకరం కావచ్చేమోగానీ … చిన్న సినిమాల పాలిట పాపమే అంటున్నారు సీనియర్ నిర్మాత దర్శకులు.తెలంగాణలో టిక్కెట్ల రేట్లు పెంచడం వల్లా చాలా మంది ప్రజలు ఇటీవల విడుదల చేసిన చిన్న సినిమాలను కనీసపు చూపు కూడా చూడలేదనేది వాస్తవం. కనుక చిన్న సినిమాను చంపేసే నిర్ణయం ప్రభుత్వం తీసుకునేలా ఒత్తిడి తెచ్చిన ఈ పెద్ద హీరోలు … చిన్న సినిమాలకూ అన్న ఆ ఐదో షోని కూడా తామే తినేస్తారు అనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు.
ఫైనల్ గా జరిగేది అదే … ఒకప్పుడు రోజుకు మూడాటలు ఆదివారం పండుగ రోజుల్లో నాలుగాటలూ అని ఉన్న థియేటర్లలో ప్రతి రోజూ నాలుగాటలు అంటూ నూన్ షోస్ కాన్సెప్టును తీసుకువచ్చినప్పుడు దాన్ని చిన్న సినిమాల కోసమే అని చెప్పారు.నిజానికి అలా ఆ రోజుల్లో అనేక చిన్న సినిమాలు నూన్ షోస్ గా విడుదలై … పెద్ద విజయాలు సాధించాయి. అలాంటి వాటిలో … దాసరి నీడ ఉంది … బి.నరసింగరావు తీసిన మా భూమి ఉంది . కన్నడ నుంచీ డబ్ అయి వచ్చిన అపరిచితులు ఉంది . తమిళం నుంచీ డబ్ అయి వచ్చి సక్సస్ అయిన మౌైనగీతం ఉంది … ప్రేమసాగరం ఉంది …ఇలా పట్టుమని పదేళ్లు కూడా కొనసాగాకుండా … రోజుకు నాలుగాటలూ పెద్ద హీరోల సినిమాలే … వేసేసే పద్దతి తీసుకువచ్చారు. అలా చిన్న సినిమాను మింగేశారు. రేపు జరగబోయేదీ అదే అన్నది ఇండస్ట్రీలో చిన్న సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్న నిర్మాత దర్శకుల అభిప్రాయం.
ఇలా ఏపీలో సినిమా పరిశ్రమ అభివ్రుద్ది చేసే బాధ్యతనూ ఐదో ఆట హామీనీ పొంది దాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలి అనే ఆలోచనలతో హ్యాపీగా అగ్రహీరోలు హైద్రాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....