నిర్మాణం పూర్తి చేసుకుని విడుదల తేదీ కూడా ప్రకటించేసిన తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ విరాటపర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాలని సురేష్ బాబు భావిస్తున్నట్టు సమాచారం.
వేణు ఉడుగుల దర్శకత్వంలో … రానా సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నక్సల్ ఉద్యమ నేపధ్యంలో తెరకెక్కింది. నిజానికి అప్పట్లో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే అనుకోకుండా కోవిడ్ అడ్డు కావడంతో విడుదల వాయిదా వేసుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.కొన్ని వాస్తవ సంఘటనల నేపధ్యంలో … తెరకెక్కిన ఈ సినిమా మీద సోషల్ మీడియాలో కూడా భారీ చర్చే నడిచింది.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో … ఇండస్ట్రీకి అనుకూల నిర్ణయంతో ముందుకు వచ్చిన నేపధ్యంలో .. సినిమాను విడుదల చేసేయాలనే నిర్ణయం నిర్మాతలు తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్. నిజానికి ఈ సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లో ఓటీటీలోనే ఈ నెలాఖరుకు విడుదల చేయాలని కూడా ప్లాన్లు నడిచాయి. అయితే ప్రభుత్వాలు సానుకూలంగా ఉండడం … కోవిద్ ధర్ట్ వేవ్ ప్రభావం కూడా తగ్గుముఖం పడుతున్న సందర్భంలో సినిమా విడుదల చేసేయడమే బెటర్ అనే ఐడియాకు వచ్చారు.నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బడ్జట్ కూడా భారీగానే ఉండడంతో థియేటర్లే సేఫ్ అనే అభిప్రాయం వ్యక్తం అయినట్టు తెలుస్తోంది.సమ్మర్ లో ట్రిపుల్ ఆర్ , భీమ్లానాయక్, ఆచార్యల వేవ్ పరిశీలించి ఓ మంచి డేట్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారట సురేష్ బాబు.