Tuesday, July 5, 2022

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతుందని సమావేశ ఎజెండా విడుదల అయింది. ఈ ఎజెండాలో అనేక అంశాలతో పాటు ప్రత్యేక తరగతి హోదా అంశం కూడా ఉండడంతో దేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది.


ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తన విజయంగా ప్రకటించుకోగా, ప్రతిపక్ష టీడీపీ నిరుత్సాహం కనపర్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గడచిన మూడేళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీని, హోమ్ మంత్రి అమిత్ షాను కలిసిన ప్రతిసందర్భంలోనూ ఈ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు తెస్తూనే ఉన్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కాస్త గట్టిగానే ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే విజయసాయి మాట్లాడిన తర్వాతరోజే ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు. ఆయన ప్రస్తావించిన లక్ష్యం కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను విమర్శించడం కోసమే అయినా దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు వాడుకున్నారు. రాష్ట్ర విభజనలో ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ప్రధాన మంత్రి విశ్వసిస్తే ఇప్పుడు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ప్రధాని సరిదిద్ద వచ్చు అనే కొత్త మెలిక పెట్టారు.


ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు బీజేపీకి అంత ఆశాజనకంగా లేవు. పైగా రాజ్యసభలో మరో రెండు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం లేక ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వైఎస్సార్ కాంగ్రెస్ అవసరం ఎక్కువగా ఉంది. అందువల్లనే బీజేపీ నాయకత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలిస్తోంది అనే అభిప్రాయం కేంద్ర హోమ్ శాఖ విడుదల చేసిన సమావేశపు ఎజెండా ద్వారా అర్ధం అయింది. వాస్తవానికి బీజేపీ నాయకత్వం చెపుతున్నట్టు ప్రత్యేక హోదా పూర్తిగా రద్దు చేసినట్టు కాదు. అందుకే గోవా ప్రజలకు ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది బీజేపీ నాయకత్వం. ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ నాయకత్వం మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్  కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉందని భావించారు. అయితే బీజేపీ రాజ్యసభ సభ్యుడు, తెలుగువాడు అయిన జి వి ఎల్ నరసింహారావు ఎందుకో ఈ పరిస్థితిని జీర్ణం చేసుకోలేకపోయారు. మొదట అవహేళనగా మాట్లాడిన నరసింహారావు ఆ తర్వాత హోమ్ శాఖ అధికారులపై వత్తిడి పెంచి ప్రత్యేక హోదా అంశాన్ని, దానితో పాటు మరికొన్ని అంశాలను ఎజెండానుండి తొలగింపజేశారు.


ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు కొత్తగా పోయేదేం లేదు. కానీ ఈ అంశాన్ని కనీసం సమావేశ ఎజెండాలో కూడా లేకుండా తొలగించిన బీజేపీకి ఈ రాష్ట్రంలో రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది. ఆ పార్టీ తమకు వస్తాయనుకున్న ఓట్లు రేపు వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో తమ ఓట్ల శాతం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ ఈ తప్పిదంతో తీవ్రంగా నష్టపోవడం ఖాయం. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా  హామీని అమలు చేయకుండా ద్రోహం చేసిన బీజేపీ ఆ అంశాన్ని కనీసం సమావేశ ఎజెండాలో కూడా ఉంచడాన్ని అంగీకరించక పొతే ఈ రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి ఓటు ఎందుకు వేస్తారు? తగిన గుణపాఠం నేర్పిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....