భీమ్లానాయక్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేయాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల పరంపర కొనసాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ఓ నిర్ణయానికి రావడంతో వర్మ దృష్టి రాబోయే సినిమాల మీదకు మళ్లింది. వెంటనే ఆయన్ని ఎట్రాక్ట్ చేసిన సినిమాలు ట్రిపుల్ ఆర్, భీమ్లానాయక్ లు.అల్లూరి సీతారామరాజు కొంరం భీమ్ ల నేపధ్యంలో తీసిన సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుండగా పవర్ స్టార్ నటించిన భీమ్లానాయక్ ఎందుకు పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాకూడదని ప్రశ్నిస్తున్నారాయన.
గతంలో పవన్ సినిమాలు బాలీవుడ్ లో నడవవు అని ఓపెన్ గా మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఇలా మాట మార్చారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఫాన్స్ ను టార్గెట్ చేస్తూ నడుపుతున్న గేమ్ గానే బావించాలనే మాట ఫాన్స్ నుంచీ వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ … భీమ్లానాయక్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనే తన డిమాండ్ నుంచీ వెనక్కి మళ్లేదే లేదు అంటున్నారాయన.పుష్ప బాలీవుడ్ లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించిన విషయం అంత తేలిగ్గా తీసుకోకూడదని హితవు చెప్తున్నారు వర్మ.మరి భీమ్లా నాయక్ నిర్మాతలు వర్మ మాటలు వింటారో లేదో కాలమే చెప్పాలి