పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబో రిపీట్ అవుతోందన్న వార్త కొంత ఇండస్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో రడీ అవుతున్న లైగర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే ఈ లోగానే విజయ్ తో మరో సినిమా అనౌన్స్ చేసేశారు పూరీ. పేరు జనగణమన. చాలా కాలం క్రితం ఇదే టైటిల్ తో మహేష్ బాబు హీరోగా సినిమా తీస్తున్నట్టు పూరీ ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యాక ఆ సినిమా ఆగిపోయింది.
కారణాలు అనేకం వినిపించాయి. రెమ్యూనరేషన్ దగ్గర నుంచీ కథలో ఉన్న డైమన్షన్స్ దాకా అనేక అంశాల్లో హీరోకీ డైరెక్టర్ కీ మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే … అదే కథను ఇప్పుడు విజయ్ దేవరకొండతో తెరకెక్కించడానికి రడీ అయిపోతున్నాడు పూరీ.
నిజానికి ఒక హీరో కోసం తయారు చేసుకున్న కథను మరో హీరోతో ఓకే చేయించడం తీసేయడం ఇండస్ట్రీలో కామనే.
పూరీనే గతంలో మెగాస్టార్ చిరంజీవికి చెప్పిన ఆటోజానీ కథనే కొద్ది పాటి మార్పులతో బాలయ్యని పెట్టి పైసావసూల్ గా తీసేశారు. అలాగే ఇప్పుడు మహేష్ తో అనుకున్న కథతో విజయ దేవరకొండను తీసుకుని ట్రావెల్ మొదలుపెడుతున్నారు.నిజానికి ఈ కథ విజయ్ కే బాగా సూటవుతుందని … అప్పటికీ ఇప్పటికీ సమాజంలో జరిగిన మార్పుల దృష్ట్యా కొన్ని మార్పులు చేసుకుని ముందుకు పోతున్నాం తప్ప మెయిన్ లైన్ ని డీవియేట్ కావడం లేదని పూరీ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు వార్త. లైగర్ పూర్తి కాగానే రిలీజ్ కు ముందే ఈ న్యూమూవీ సెట్స్ మీదకు వెళ్లడమే కాదు శరవేగంతో షూటింగ్ పూర్తి చేసి లైన్లో పెట్టేయాలనేది పూరీ ఆలోచన.
అలా లైగర్ తో సెట్ అయిన పూరీ విజయ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. మహేష్ తో రెండు ప్రభాస్ తో రెండూ గతంలో చేశారు పూరీ. అలాగే ఇప్పుడు విజయ్ తోనూ రెండో ప్రాజెక్ట్ చేపబుతున్నారు. మరి ఈ కాంబో ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ లోకి ట్రావెల్ అవుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం కాస్త ఆగాల్సి ఉంటుంది.