ప్రస్తుతం తెలుగు సినిమా హీరోల పరిస్తితి ఎలా ఉందంటే … సిన్మా హిట్టవడం పాపం అమాంతం రెమ్యూనరేషన్లు పెంచేస్తున్నారు. తమ మీద అంత బడ్జట్ వర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడడం లేదు. ఇక హిట్ తో ఉన్న డైరెక్టర్లైతే … అంతకంటే మొండిగా హీరోకెంతిస్తారో మాకూ అంతే ఇవ్వాలి తగ్గేదే ల్యా అంటున్నారు.దీంతో .. నిర్మాతలు తలలు పట్టుకుని కూర్చుంటున్నారు. ఇద్దరి రెమ్యూనరేషన్లూ కలిపి హీరో మార్కెట్టంత అయితే మిగిలింది ఏం పెట్టి తీయాలి వాటి కోసం ఎవడ్ని పట్టుకోవాలి అని బావురుమంటున్నారు.ఆ మధ్య వచ్చిన పూరీ రెండు మెదడ్ల సినిమా హిట్ అవడం .. ఆ తర్వాత వచ్చిన సినిమా యావరేజ్ కావడంతో ప్రస్తుతం తన రేటు పదిహేను కోట్లు అనేస్తున్నాడు హీరోరామ్.అతనితో బోయపాటిని జత చేసి ఓ భారీ హిట్టుకు పథకం వేసిన నిర్మాతగారు ఇది విని ఖంగారు పడిపోయి బోయపాటిని అడిగాడు.బాబుదేం తప్పులేదు … నాకూ అదే ఇవ్వండి అన్నాడు.
ఇద్దరికీ ముప్పై పెట్టి ముప్పై ఐదు నుంచీ యాభై కోట్ల మార్కెట్ ఉన్న హీరోతో వంద కోట్ల సినిమా ఎలా చేయను దేవుడా అంటున్నాడు నిర్మాత.ఒకేళ సినిమా తేడా అయితే బోయపాటిదేం పోయిందీ … హాయిగా బాలయ్యతో అఖండ పార్ట్ టూ నో లెజండ్ పార్ట్ టూనో తీసేసుకుంటాడు. నా పరిస్థితి అలా కాదే అంటున్నారు. మైత్రీ మూవీస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ తదితర సంస్ధల అడ్వాన్సులు బోయపాటి దగ్గర ఉన్నాయి.
అలాగే బన్నీతో మూవీ చేయాలనే ప్రపోజలు కూడా ఉంది … వీటితో పాటు రామ్ ఐడియా కూడా ఉంది … అయితే బోయపాటి మనసులో ఉన్న హీరో వేరు అంటున్నారు సన్నిహితులు.ఎవరా హీరో అని వాకబు చేయగా … రామ్ చరన్ పేరు వినిపిస్తోంది. ఎలాగైనా రామ్ చరణ్ ను ఒప్పించి ఓ భారీ హిట్టు తీసేస్తే … తనకు ఆ ఫ్యామ్లీ నుంచీ కూడా ఇబ్బంది ఉండదు అనేది ఆయన ఒపీనియన్‌ను .